తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్‌కు ఆ ముగ్గురు స్టార్ క్రికెటర్లు డుమ్మా.. కారణం ఇదే..!

ఐపీఎల్​కు ఉన్న క్రేజ్​ ఏంటో వేరేగా చెప్పనక్కర్లేదు.​ అభిమానులను ఉర్రూతలూగించే ఈ ఆట డిసెంబర్​ నుంచి జరగనుంది. కాగా, ఈ ఐపీఎల్​కు ముగ్గరు స్టార్ క్రికెటర్లు దూరంగా ఉంటారని సమాచారం. వారెవరంటే..?

Australia
ఆస్ట్రేలియా

By

Published : Nov 15, 2022, 9:45 AM IST

వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నుంచి విదేశీ స్టార్‌ ప్లేయర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెయిన్‌ రిలీజ్‌, ట్రేడింగ్‌, మినీ వేలం కోసం సన్నాహకాల్లో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్‌ నుంచి తప్పుకుంటున్నారు.

ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హిట్టర్‌, ఇంగ్లాండ్‌ ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్‌.. టెస్ట్‌ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అంటూ లీగ్‌ నుంచి వైదొలగాడు. తాజాగా ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు పాట్‌ కమిన్స్‌ (కేకేఆర్‌), ఆరోన్‌ ఫించ్‌ (కేకేఆర్‌), మిచెల్‌ స్టార్క్‌ దేశ విధులే తమకు ముఖ్యమంటూ లీగ్‌కు దూరం కానున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరిగే యాషెస్‌ సిరీస్‌ కోసం ఫిట్‌గా ఉండేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్క్‌ గతేడాదే ఐపీఎల్‌పై తన అయిష్టతను వ్యక్త పరిచాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ (2023) ట్రేడింగ్‌లో భాగంగా కేకేఆర్‌ జట్టు.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (అఫ్గానిస్థాన్​), లోకీ ఫెర్గూసన్‌ (న్యూజిలాండ్‌)లను డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి, అలాగే టీమ్​ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి తెచ్చుకున్న విషయం తెలిసిందే. కమిన్స్‌, ఫించ్‌, సామ్‌ బిల్లింగ్స్‌ స్థానాలను వీరు భర్తీ చేసే అవకాశం ఉంది.

కాగా, కొచ్చి వేదికగా డిసెంబర్‌ 23న జరగనున్న ఐపీఎల్‌-2023 మినీ వేలం నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకోవాలనుకున్న ఆటగాళ్ల జాబితాతో పాటు వద్దనుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని బీసీసీఐ నవంబర్‌ 15న డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ప్రస్తుతానికి ముంబై, చెన్నై జట్లు మాత్రమే తమ రిలీజ్డ్​, రీటెయిన్డ్‌ ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకి సమర్పించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:KKRకు గట్టి షాక్​ ఇచ్చిన సామ్​.. సీజన్​ మొత్తానికి దూరంగా ఉండాలని..

వన్డేలో యంగ్​ ప్లేయర్​ సంచలనం.. 400 ప్లస్​ రన్స్​.. రోహిత్ రికార్డ్​ బ్రేక్​

ABOUT THE AUTHOR

...view details