Tom Latham Sachin Tendulkar: న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అరుదైన ఘనత సాధించాడు. పుట్టినరోజు నాడు వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన 24 ఏళ్ల కిందటి రికార్డును బ్రేక్ చేశాడు.
నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డేలో అజేయంగా 140* పరుగులు చేశాడు లాథమ్. దీంతో ఆ జట్టుపై 118 పరుగుల భారీ తేడాతో కివీస్ విజయం సాధించింది. వన్డేల్లో లాథమ్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు. పైగా ఏప్రిల్ 2 అతడి బర్త్‌డే. దీంతో పుట్టినరోజున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు లాథమ్. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉండేది. 1998లో సచిన్ తన పుట్టినరోజున 134 పరుగులు చేశాడు.