తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా సెలెక్టర్లు.. ఆ విషయంపై దృష్టిపెట్టాలి: కపిల్​దేవ్ - టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 20) టీమ్​ఇండియా పేలవ ప్రదర్శన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశాడు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev News). బీసీసీఐ.. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే అంశంపై ఆలోచించాలని అభిప్రాయపడ్డాడు.

kapil dev
కపిల్ దేవ్

By

Published : Nov 3, 2021, 3:55 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) టీమ్​ఇండియా పేలవ ప్రదర్శన అభిమానులకు నిరాశ పరుస్తోంది. సీనియర్​ ఆటగాళ్ల ఆటతీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev News) కీలక వ్యాఖ్యలు చేశాడు. సెలెక్టర్లు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నాడు. సీనియర్​ ఆటగాళ్లు ఇంతలా విఫలమవుతున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని కోరాడు.

"ఇతర జట్ల ఆటతీరు ఆధారంగా టీమ్ఇండియా ముందుకెళ్లడాన్ని భారత క్రికెట్ ఎప్పుడూ అంగీకరించదు. వరల్డ్ ​కప్ గెలవాలన్నా, సెమీస్​లో అడుగుపెట్టాలన్నా అది మన జట్టు ఆటగాళ్ల సామర్థ్యంతోనే సాధ్యమవ్వాలి. సెలక్టర్లు కూడా సీనియర్​ ఆటగాళ్ల భవితవ్యంపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చేసింది."

--కపిల్ దేవ్, మాజీ క్రికెటర్.

ఐపీఎల్​లో రాణిస్తున్న యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే అంశంపై సెలెక్టర్లు ఆలోచన చేయాలని కపిల్ దేవ్(Kapil Dev News Today) అన్నాడు. వారికి అవకాశమిస్తేనే భవిష్యత్తులో టీమ్​ఇండియా జట్టుపై క్లారిటీ వస్తుందని అభిప్రాయపడ్డాడు. సీనియర్​ క్రికెటర్లు ఇంత ఘోరంగా విఫలమైతే.. టీమ్​ఇండియాపై విమర్శలు తప్పవని పేర్కొన్నాడు. బీసీసీఐ చొరవ తీసుకుని యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం ప్రారంభించాలని తెలిపాడు. ఒక వేళ ఆరంభంలో యువ ఆటగాళ్లు ఓటమి పాలైనా వారికి అది అనుభవంలా మారుతుందని స్పష్టం చేశాడు.

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ ఉన్న నేపథ్యంలో టీమ్​ఇండియా జట్టుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు మాజీ క్రికెటర్లు. న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని చెబుతున్నారు.

ఇది చదవండి: అఫ్గాన్​ను తక్కువ అంచనా వేయొద్దు: భజ్జీ

ABOUT THE AUTHOR

...view details