ఓ మహిళా సహోద్యోగురాలికి అసభ్యకర సందేశాలు పంపించినట్లు ఆరోపణల నేపథ్యంలో.. టెస్ట్ జట్టు కెప్టెన్‌గా తప్పుకున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ పైన్(Nathan lyon Tim Paine). ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌కు(Ashes Series 2021) ముందు ఈ ప్రకటన చేశాడు. అయితే.. ఈ ఆరోపణల ప్రభావం టిమ్‌పై ఉండకూడదని, అతడికి జట్టులో అవకాశం కల్పించాలని పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన ఆఫ్ స్పిన్నర్ నాథన్ లైయన్.. టిమ్ పైన్ ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్ అని కొనియాడాడు.
"యాషెస్ సిరీస్ కోసం ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని సెలెక్టర్లు చెప్పారు. నా దృష్టిలో టిమ్ పైన్ ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్. ఓ బౌలర్‌గా జట్టులో మంచి వికెట్ కీపర్ ఉండాలని నేను ఆశిస్తా. బౌలర్లందరి అభిప్రాయం కూడా ఇదే."
--నాథన్ లైయన్, ఆస్ట్రేలియా బౌలర్.
ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా పైన్‌కు మద్దతుగా ఉన్నారని తెలిపాడు నాథన్(Nathan lyon News). గబ్బా వేదికగా జరగనున్న తొలి టెస్టులో పైన్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. పాట్ కమిన్స్ లేదా స్మిత్‌కు టెస్టు సారథి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.
జట్టుపై తీవ్ర ప్రభావం..