ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్కు ముందు.. ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్సీకి రాజీనామాచేస్తున్నట్లు టిమ్ పైన్ ఇటీవల ప్రకటించాడు. 2017లో ఓ మహిళా సహోద్యోగికి అసభ్యకర సందేశాలు(Tim paine messages) పంపడమే పైన్ రాజీనామాకు(Tim paine captaincy) కారణం. అయితే.. తాను ఎంత వద్దనుకున్నా ఆ అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బయటకు వస్తాయని తనకు తెలుసని పైన్ అన్నాడు. తాజాగా అతడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో(Tim paine interview) ఈ విషయం వెల్లడించాడు.
"తొలుత ఈ వివాదం సమసిపోయిందని భావించినా.. పెద్ద సిరీస్‌లు లేదా మా క్రికెట్ సీజన్ మొదలయ్యే ముందు ప్రతిసారీ ఈ వివాదం నా దృష్టికి వస్తూనే ఉంది. నా సందేశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు(Tim paine chat) తమ వద్ద ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తరచూ హెచ్చరించేవి. అయితే, వాళ్లు ఎప్పుడూ దీనిపై వార్తలు ప్రసారం చేయకపోయినా.. ఎప్పుడైనా ఈ వివాదం బయటకు పొక్కుతుందనే విషయం నాకు ముందే తెలుసు. ఇదంతా నేను టెస్టు కెప్టెన్సీ చేపట్టక కొన్ని నెలల ముందు జరిగింది. అది మా ఇద్దరి అంగీకారంతో జరిగిన వ్యవహారం. అప్పుడు నా కెప్టెన్సీకి ఇది సమస్యగా పరిణమిస్తుందనే విషయం గురించి ఆలోచించలేదు."