Tim David IPL 2022: ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుతమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు సింగపూర్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్. తద్వారా తను తాను పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. "నెట్స్‌లో ఎదుర్కోవాలని నేను ఎదురుచూస్తున్న బౌలర్లలో ఒకడు బుమ్రా. అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. కానీ అతడ్ని ఎదుర్కొని నన్ను నేను పరీక్షించుకోవడం చాలా గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను. ఇందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది" అని టిమ్ పేర్కొన్నాడు.
"ముంబయి ఇండియన్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇంత విజయవంతమైన జట్టులో చోటు లభించడం చాలా గొప్ప విషయమని నేను భావిస్తున్నాను. ముంబయి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లను ఎలా చూసుకుంటుందనే దాని గురించి గొప్పగా విన్నాను. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మంచి ప్రదర్శన చేయడానికి ఎప్పుడూ అవకాశముంటుంది. ఏదేమైనా చాలా ఆనందంగా ఉంది" అని టిమ్ తెలిపాడు. కీరన్ పోలార్డ్, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్లతో ఆడబోతున్నందుకు ఆనందంగా ఉందన్న టిమ్.. తన ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు ఇదో గొప్ప అవకాశమని చెప్పాడు.
Tim David IPL Price