తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tim Bresans Retirement: క్రికెట్​కు ఇంగ్లాండ్ స్టార్​ ఆల్​రౌండర్​ గుడ్​బై - క్రికెట్​కు టిమ్​ బ్రేస్నన్ గుడ్​బై

Tim Bresans Retirement: ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ టిమ్​ బ్రెస్నన్.. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్​షైర్​ కౌంటీ ధ్రువీకరించింది.

Tim Bresans Retirement
Tim Bresans Retirement

By

Published : Jan 31, 2022, 7:52 PM IST

Tim Bresans Retirement: ఇంగ్లాండ్ స్టార్​ ఆల్​రౌండర్​ టిమ్​ బ్రెస్నన్​ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. తమ దేశానికి తొలి టీ20 ప్రపంచకప్​(2010) అందించిన జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఇతడు.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు 21 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్విక్​షైర్​ కౌంటీ సోమవారం ధ్రువీకరించింది.

ఇంగ్లాండ్​​ తరఫున 23 టెస్టులు, 85 వన్డేలు, 34 టీ20లు ఆడిన 36ఏళ్ల బ్రెస్నన్​.. దాదాపు 1700 పరుగులు, 205 వికెట్లు పడగొట్టాడు. అతని ఖాతాలో నాలుగు అర్ధ శతకాలు, రెండు సార్లు 5 వికెట్లు తీసిన ఘనతలు ఉన్నాయి. ఇంగ్లాండ్​ యాషెస్​ గెలిచిన రెండు సందర్భాల్లో బ్రెస్నన్​ కీలకంగా వ్యవహరించాడు.

జాతీయ జట్టుతో కంటే.. కౌంటీ జట్టు వార్విక్​షైర్​తోనే ఎక్కువ అనుబంధం కలిగిన బ్రెస్నన్​.. 213 ఫస్ట్​ క్లాస్​ మ్యాచ్​ల్లో 575 వికెట్లు తీశాడు. 7,128 పరుగులు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:West Indies Tour Of India: అహ్మదాబాద్​ చేరుకున్న టీమ్​ఇండియా

ABOUT THE AUTHOR

...view details