కొవిడ్ నుంచి కోలుకోవడమనేది మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనుభవంలాంటిదని తెలిపాడు చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ బాలాజీ. కరోనా సోకి ఇన్ని రోజులైనప్పటికీ మాకు వైరస్ ఎలా అంటుకుందన్న విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నాడు.
"కొవిడ్ నిర్ధరణ అయిన తర్వాత సీఎస్కే బృందం నుంచి నన్ను వేరు చేశారు. అప్పుడు కరోనాను జయించడం మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ లాంటిదనిపించింది. మే 2న ఒళ్లు నొప్పులతో పాటు ముక్కు పట్టేయడం వల్ల అదే రోజు కరోనా పరీక్ష చేయించుకున్నాను. తర్వాత రోజు వైరస్ నిర్ధరణ అయింది. కరోనా అని తెలిశాక చాలా కంగారుపడ్డాను. సహచరుల గురించి ఆందోళన చెందాను" అని బాలాజీ వెల్లడించాడు.
ముఖ్యంగా తనతో పాటు రాజీవ్ కుమార్(సీఎస్కే ఫీల్డింగ్ కోచ్), ఉతప్ప, పుజారా, దీపక్.. ఉన్నారని బాలాజీ తెలిపాడు. వీరిలో ఏ ఒక్కరికీ పాజిటివ్ వచ్చినా పరిస్థితి ఏంటని మదన పడ్డానని పేర్కొన్నాడు. వారి ఆరోగ్యం బాగుండాలని దేవున్ని ప్రార్థించానని వెల్లడించాడు.
ఇదీ చదవండి:పరుగుల కోసం కోచ్ రవిశాస్త్రి నయా ఫార్ములా!