Tilak Varma International Career : వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఓటమిపాలైంది టీమ్ఇండియా. పసికూనలతో పోటీ పడి ఐసీసీ మెగా ఈవెంట్లకు అర్హత సాధించలేక చతికిలపడ్డ విండీస్ చేతిలో టీమ్ఇండియా ఓడిపోయింది. అయితే.. ఈ పర్యటన ద్వారా యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ రూపంలో ఇద్దరు యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో క్రీడావర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. వారి గురించి తెలుసుకుందాం ఓ సారి.
అరంగేట్రంలో అదరగొట్టిన యువ ఆటగాళ్లు..
Yashasvi Jaiswal And Tilak Varma : కేవలం ఐపీఎల్‌కు మాత్రమే తమ ఆట పరిమితం కాదని.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటగలమని నిరూపించుకున్నారు ఈ యువ ఆటగాళ్లు. అరంగేట్ర మ్యాచ్‌లోనే విలువైన ఇన్నింగ్స్ ఆడి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. టెస్టులో సెంచరీతో యశస్వి మెరవగా.. తిలక్ తొలి టీ20లోనే టాప్ స్కోరర్‌గా నిలిచి ఔరా అనిపించుకున్నాడు.
బౌలింగ్‌లో సత్తా..
Tilak Varma Bowling Stats : ఇక వెస్టిండీస్‌తో నాలుగో టీ20కి ముందు భవిష్యత్తులో తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్‌తో వీరిద్దరితో బౌలింగ్ కూడా చేయిస్తామంటూ టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే తెలిపాడు. నైపుణ్యాలకు పదును పెడితే కచ్చితంగా బౌలర్లుగా కూడా రాణించలగరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. అందుకు తగ్గట్లుగానే తిలక్ వర్మ ఐదో టీ20లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి.. 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నికోలస్ పూరన్ వంటి బిగ్ హిట్టర్‌ను ఔట్ చేశాడు. బ్రాండన్ కింగ్‌తో మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిన పూరన్‌ను బోల్తా కొట్టించాడు తిలక్.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్లో తిలక్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన పూరన్.. స్విచ్ హిట్‌కు యత్నించి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో తిలక్ వర్మకు అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.