Tilak Varma Asia Cup 2023 : తిలక్ వర్మ.. ఇప్పుడీ పేరు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ప్రతిష్టాత్మక ఆసియా కప్ (Asia Cup 2023)లో టీమ్ఇండియా వన్డే జట్టుకు ఎంపిక కావడమే. దీంతో అతడు ప్రపంచకప్ (ODI World Cup 2023)లోనూ ఆడే అవకాశముందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్లకే ఐపీఎల్లో అదరగొట్టి.. టీమ్ఇండియా టీ20 జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ కుర్రాడు.. అతి తక్కువ కాలంలోనే ఎదిగిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Tilak Varma Family Background : మధ్య తరగతి కుటుంబం.. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో.. హైదరాబాద్ నుంచి టీమ్ఇండియాకు ఎంపికైన వారు చాలా అరుదు. ప్రస్తుత క్రికెటర్లలో మహ్మద్ సిరాజ్ తర్వాత ఇతడే సెలెక్ట్ అయింది. సిరాజ్ తరహాలోనే తిలక్‌ది కూడా ఓ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ. తండ్రి నాగరాజు వర్మ ఎలక్ట్రీషియన్. తల్లి గృహిణి. తిలక్‌కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎక్కువ ఆసక్తి.
Tilak Varma Cricket Career :అలా మొదలైంది... 11 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుతూ కోచ్ సలీం దృష్టిలో పడటం, ఆ తర్వాత ఆయన తిలక్‌కు లింగంపల్లిలోని ఒక అకాడమీలో శిక్షణ ఇప్పించడం.. దీంతో అతడు రోజూ 20 కిలోమీటర్లు జర్నీ చేసి క్రికెట్ సాధన చేయడం.. ఇలా తిలక్ క్రికెట్ జర్నీ మొదలైంది. అతడు ముందుగా స్కూల్ లీగ్స్‌లో సత్తా చాటాడు. ఆ తర్వాత హైదరాబాద్ తరఫున 2018–19 సీజన్లో 16 ఏళ్లకే రంజీ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సీజన్లోనే ఏడు మ్యాచ్‌లలో 215 స్కోరు చేసి ఆకట్టుకున్నాడు. అనంతరం టీ20 ఫార్మాట్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మంచిగా రాణించాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
Tilak Varma IPL Career :ఐపీఎల్లో ధనాధన్.. తిలక్ ధనాధన్ బ్యాటింగ్.. పార్ట్ టైం స్పిన్ చూసిన ముంబయి ఇండియన్స్.. 2022 సీజన్ ముందు జరిగిన వేలంలో రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. తుది జట్టులోనూ అవకాశమిచ్చింది. దీంతో అతడు తన మొదటి సీజన్లోనే 14 మ్యాచ్‌ల్లో 36కు పైగా యావరేజ్‌తో 303 రన్స్ సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 11 మ్యాచ్‌ల్లో 43 యావరేజ్‌తో 200కు పైగా స్కోర్ చేశాడు. ముఖ్యంగా మిడిలార్డర్ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం అందర్నీ ఆకట్టుకుంది. లెఫ్ట్ హ్యాండర్ అవ్వడం కూడా అతడికి బాగా కలిసొచ్చింది.