తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ మ్యాచ్​కు అంత క్రేజా... నిమిషాల్లో అమ్ముడైన టికెట్లు... - ఐసీసీ ప్రపంచ కప్​ 2022 టికెట్లు

టీ20 ప్రపంచకప్​లో భాగంగా జరగబోయే ఓ​ మ్యాచ్​ ముందుగానే ఓ రికార్డు సాధించింది. ఈ మ్యాచ్​కు సంబంధించిన టికెట్లు హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయని ఐసీసీ తెలిపింది. ఆ మ్యాచ్ ఏంటంటే..

icc world cup 2022 tickets
icc world cup 2022 tickets

By

Published : Sep 15, 2022, 1:03 PM IST

India Vs Pak Match Tickets : వచ్చే నెలలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్​లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్​తో టీమ్​ఇండియా అక్టోబర్​ 23న తలపడనుంది. మెలబోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​లో జరగున్న ఈ మ్యాచ్​ మొదలవ్వకముందే ఓ రికార్డు సృష్టించింది. దీనికి సంబంధించిన టికెట్లు అప్పుడే సేల్​ అయిపోయాయని ఐసీసీ వెల్లడించింది. స్టాండింగ్​ రూమ్​ టికెట్స్​ కూడా అమ్ముడుపోయినట్లు తెలిపింది.

కాగా, అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒక్క నెలలో జరగనున్న ఈ మ్యాచ్‌లన్నింటికి కలిపి దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. 82 దేశాల నుంచి అభిమానులు ఈ టికెట్లు కొనుగోలు చేశారని.. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొననుండగా.. ఈసారి అన్ని స్టేడియాలు ఫుల్‌ అయ్యేలా కనిపిస్తుందంటూ పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాలో అతిపెద్ద గ్రౌండ్‌ అయిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ) కెపాసిటీ 86,174 కాగా.. అన్ని సీట్లు ఫుల్‌ అయ్యాయని ఐసీసీ తెలిపింది.

"ఈ టీ20 ప్రపంచకప్​కు అన్ని వయసుల వారు ఆహ్వానితులే.. మరో నెలలో ప్రారంభం కానున్న టోర్నీ ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది అభిమానులు హాజరు కానున్నారు." అని ఐసీసీ తెలిపింది. సేల్​ ప్రారంభమైన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోవడం రికార్డు అని ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. త్వరలో మరోసారి టికెట్లు రిలీజ్​ చేస్తామని వెల్లడించింది. ఇక పాక్​-ఇండియా మ్యాచ్​ తరహాలో సౌత్​ ఆఫ్రికా- బాంగ్లాదేశ్​ మ్యాచ్​ టికెట్లు కూడా అన్ని అమ్ముడైపోయాయని పేర్కొంది.

ఇదీ చదవండి:వినేశ్‌ ఫొగాట్‌ రికార్డు.. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రెండో పతకం

Bumrah: మొదలుపెట్టేశాడు కఠోర సాధన.. ఇక మైదానంలో అదరగొట్టడమే

ABOUT THE AUTHOR

...view details