ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమ్ఇండియా ఘోర ఓటమిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కేవలం 117 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. పది వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ ఓటమితో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ పేలవ రికార్డు గతంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. అయితే ఇప్పుడా రికార్డునే హిట్‌మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అదేంటంటే.. టీమ్ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ధోనీ ఒకడు. అతడి సారథ్యంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలను ముద్దాడింది. వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ.. ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలో టీమ్ఇండియా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ధోనీ వారసుడిగా జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించిన విరాట్ కోహ్లీ మాత్రం ఐసీసీ ట్రోఫీలను ముద్దాడలేకపోయాడు. కానీ టీమ్‌ను ప్రపంచకప్ క్రికెట్లో బలంగా నిలిపాదడు. అలాగనే టెస్టుల్లో భారత జట్టును నెం.1 స్థానంలో నిలబెట్టాడు. ఇక కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ జట్టు పగ్గాలను అందుకున్న విషయం తెలిసిందే. అయితే హిట్‌మ్యాన్ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్‌గా కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నాడు. కెప్టెన్‌గానూ ఓ రికార్డును మూటగట్టుకున్నాడు.