ఐపీఎల్లో తాము ఆడిన జట్టుకి ప్రాతినిధ్యం వహించకుండా.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన, వ్యవహరించబోతున్న ప్లేయర్లు ఎవరో తెలుసా? వారి గురించి ఓ సారి తెలుసుకుందామా మరి.
అజింక్యా రహానే..
Ajinkya Rahane Captain : అజింక్య రహానే ఈ పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2011 నుంచి 2015 వరకు భారత్ జట్టులో అజింక్యా రహానే రెగ్యులర్ ప్లేయర్. నిలకడైన ఆటతో రహానే ఆకట్టుకోవడం వల్ల 2015లో భారత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి లభించింది. జింబాబ్వేతో జరిగిన 3 వన్డేల సిరీస్, T20లకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే సిరీస్‌ను ఇండియా వైట్‌వాష్ చేయగా.. టీ20 సిరీస్‌ను సమం చేసింది. ఈ సిరీస్‌తో రహానేకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే 2018లో బాల్‌టాంపరింగ్ ఆరోపణలతో అప్పటి రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో అజింక్యా రహానేను కెప్టెన్‌గా నియమించింది ఆర్ఆర్ యాజమాన్యం. IPLలో రహానే 24 మ్యాచ్‌లకు రాయల్స్‌కు నాయకత్వం వహించాడు. అందులో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించగా.. 15 మ్యాచ్‌లో ఓటమిపాలైంది.ఇలాగే 2023 ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మిడిలార్డర్లో అజింక్యా రహానే అదరగొట్టాడు.