IPL 2023: కేన్ మామను వదిలేసిన సన్‌రైజర్స్.. చెన్నైలోనే జడేజా.. మిగతా జట్లు ఏం చేశాయంటే? - ఐపీఎల్ 2023 అప్టేట్సు
భారత టీ20 లీగ్‌లో ఫ్రాంచైజీల పరస్పర అంగీకారంతో ఆటగాళ్ల మార్పిడి జరిగిపోయింది. తాజాగా అట్టిపెట్టుకున్న/ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఆ వివరాలు..
IPL 2023 Retained Squad: భారత టీ20 లీగ్ 2023 సీజన్‌కు సంబంధించి 10 ఫ్రాంచైజీలు తాము వదులుకొనే, అట్టిపెట్టుకొనే ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. రిటెయిన్/రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను వెల్లడించాల్సిన గడువు ఇవాళ్టితో (నవంబర్ 15) ముగిసింది. అయితే గడువుకు ముందే ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు మార్పిడి చేసుకొనే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ఇక మిగిలిన వారంతా డిసెంబర్ 23న కోచి వేదికగా జరిగే మినీ వేలంలోకి వచ్చేస్తారు. మరి ఏ జట్టు ఎవరిని వదులుకొంది.. ఎవరిని అట్టిపెట్టుకొంది అనే విషయాలను పరిశీలిస్తే..
కెప్టెన్‌తో సహా కీలక ప్లేయర్లు..
గత సీజన్‌లో దారుణ ప్రదర్శన చేసిన హైదరాబాద్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టినట్లుంది. కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్‌తోపాటు సీనియర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌తోపాటు జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెఫెర్డ్, సౌరభ్ దూబె, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, సుషాంత్ మిశ్రా, విష్ణు వినోద్‌ను వదులుకుంది. దీంతో ఆ ఫ్రాంచైజీ ఖాతాలో రూ. 42.25 కోట్లు ఉన్నాయి. తుది జట్టు:అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూఖి, కార్తిక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
ముంబయి జట్టులో..
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయికి గత సీజన్ ఓ పీడకల. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ కీరన్ పొలార్డ్‌ను వదిలేసింది. అలాగే అన్‌మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బసిల్ థంపి, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయ్‌దేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ది, రిలీ మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్‌ను రిలీజ్ చేసింది. తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, బుమ్రా, జొఫ్రా ఆర్చర్, అర్జున్ తెందూల్కర్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ సింగ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, అర్షద్ ఖాన్, అకాశ్ మాధ్వాల్
చెన్నై జట్టు ఇలా..
రవీంద్ర జడేజాను పక్కన పెడతారేమోనని భావించిన అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ చెన్నై అతడిని రిటెయిన్ చేసుకొంది. అనూహ్యంగా డ్వేన్ బ్రావ్‌ను వదిలేసుకొంది. అతడితోపాటు ఆడమ్ మిల్నే, క్రిస్ జొర్డాన్, ఎన్ జగదీశన్, సి హరినిశాంత్, కే భగత్ వర్మ, కేఎం అసిఫ్, రాబిన్ ఉతప్ప (రిటైర్డ్)ను రిలీజ్ చేసింది. తుది జట్టు:ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, శుభ్రాన్షు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముకేశ్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్థన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, మహీషా పతిరాన