ఎంత అనుభవం ఉన్నా.. ఎలాంటి ఆటగాడైనా.. ఎంత గొప్ప జట్టైనా.. ప్రపంచకప్ మ్యాచుల్లో ఆడుతుంటే కాస్త ఆందోళనగానే ఉంటుంది. క్రికెటర్ల మనస్సుల్లో భయంగానే ఉంటుంది.
ఆ ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నిపుణులు, కోచ్‌లు ఇచ్చే సలహాలను ఆటగాళ్లు పాటించడం పరిపాటి. అయితే 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లకు అప్పటి మెంటల్ కండీషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ ఓ వింత సూచన చేశాడట. మ్యాచులకు ముందు శృంగారంలో పాల్గొనాలని చెప్పాడట. దాంతో అప్పటి ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కు నోట మాట రాలేదట. ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేశాడట.
2011 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా జట్టు ఈ విషయాలను ప్యాడీ అప్టన్ తన ఆత్మకథ 'ది బేర్‌ఫూట్ కోచ్' పుస్తకంలో పొందుపరచాడు. శృంగారం చేయాలన్న సలహా ఇచ్చినందుకు ఆ తర్వాత క్షమాపణ చెప్పానని అప్టన్ వివరించాడు. అంతేకాదు 2009 ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం చేసిన నోట్స్‌లోనూ శృంగారం వల్ల కలిగే లాభాలేంటో సవివరంగా రాశాడట. 'శృంగారం చేయడం వల్ల మీ ప్రదర్శన మెరుగవుతుందా? అవును, పెరుగుతుంది' అని ఆ నోట్స్‌లో రాసినట్టు పుస్తకంలో వెల్లడించాడు.
కోచ్‌గా ఉన్నప్పుడు చెప్పని విషయాలను ప్యాడీ అప్టన్ ఒక్కొక్కటిగా బయటకు వెల్లడిస్తున్నాడు. అయితే 2011 ప్రపంచకప్‌లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. యువరాజ్ సింగ్ మెరుపులతో ధోనీసేన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడింది.
2011 ప్రపంచకప్ గెలిచిన అనంతరం టీమ్ఇండియా ఇవీ చదవండి: