సాధారణంగా చాలామంది ఆటకు టాటా చెప్పాక కూడా మైదానాన్ని వదలరు. వ్యాఖ్యాతగా, అంపైర్లుగా, కోచ్‌లుగా, బోర్డుల్లో పెద్దలుగా క్రికెట్‌కి అనుబంధంగానే కొనసాగుతుంటారు. లేదంటే సొంత వ్యాపారాల్లోకి వెళ్లిపోతుంటారు. కానీ కొంతమంది మా రూటే సెపరేటు అన్నట్టుగా ఎవరూ ఊహించని పాత్రల్లోకి వెళ్లిపోయారు. అలాంటి వాళ్ల వివరాలు..
నటుడైన బ్రెట్‌లీ
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అభిమానులున్న క్రికెటర్లలో బ్రెట్‌లీ (Brett Lee) ఒకడు. తనకి భారత్‌తో అనుబంధం ఎక్కువే. వన్డే, టెస్ట్ మ్యాచ్‌ల్లో (Brett Lee Stats) కలిసి 690 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా పేరున్నవాడు. రిటైర్ అయ్యాక మ్యూజిక్, యాక్టింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాడు. సొంతంగా ఆల్బమ్స్ పాడాడు. తను గిటార్ బాగా వాయించగలడు. కొన్ని ప్రదర్శనలు కూడా చేశాడు. మిస్ట్ ఆస్ట్రేలియా జెస్టినా క్యాంప్‌బెల్‌తో కలిసి 'గెటవే' పేరుతో ట్రావెల్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అది ఫాక్స్ లైఫ్ ఛానెల్లో ప్రసారమైంది. అంతేకాదు.. 'అన్ ఇండియన్' పేరుతో వచ్చిన బాలీవుడ్ సినిమాలోనూ నటించాడు బ్రెట్‌లీ.
రింగులో దిగిన ఆండ్రూ ఫ్లింటాఫ్
ఇంగ్లాండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ని ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా చెబుతుంటారు. ఏడువేల పరుగులు, 400 వికెట్లు అతడి (Andrew Flintoff Stats) ఖాతాలో ఉన్నాయి. క్రికెట్‌కి వీడ్కోలు (Andrew Flintoff Retirement) పలికిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఫ్లింటాఫ్ బాక్సింగ్ రింగ్‌లోకి దిగాడు. అదిరిపోయే అరంగేట్రం చేశాడు. అమెరికన్ స్టార్ బాక్సర్, అప్పటిదాకా ఓటమన్నదే ఎరుగని రిచర్డ్ డాసన్‌ని (Andrew Flintoff Boxing Career) మొదటి మ్యాచ్‌లోనే మట్టి కరిపించాడు. తర్వాత అడపాదడపా మ్యాచ్‌లు ఆడుతూనే ఉన్నాడు.
కర్ట్‌లీ ఆంబ్రోస్
తన జమానాలో నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మన్‌ని గడగడలాడించిన వెస్టిండీస్ బౌలర్ కర్ట్‌లీ ఆంబ్రోస్ (Curtly Ambrose News). 600 వికెట్లకు పైగా అంతర్జాతీయ వికెట్లు తీశాడు (Curtly Ambrose Stats). బంతిని వదిలిన తర్వాత తను గిటారిస్టుగా మారాడు. ఆంటిగ్వాకు చెందిన మ్యూజిక్ బ్యాండ్‌లు సోకా, రెగ్గే, డ్రెడ్, ది బాల్డ్‌హెడ్ బ్యాండ్‌లలో సభ్యుడిగా చేరాడు. బాస్ ప్లేయర్‌గా మంచి పేరే సంపాదించాడు.
క్యాబ్ డ్రైవర్ అర్షద్‌ఖాన్
బ్యాట్‌తో, బంతితో పాకిస్థాన్‌కి కొన్ని చిరస్మరణీయమైన విజయాలు అందించిన క్రికెటర్ అర్షద్‌ఖాన్. తక్కువ మ్యాచ్‌లే ఆడినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా దేశం తరపున ఆడేందుకు పెద్దగా అవకాశాలు రాకపోవడం వల్ల క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ వెళ్లి క్యాబ్‌డ్రైవర్‌గా (Arshad Khan Taxi Driver) మారాడు. మంచి ఆటగాడు ఇలా మారడం విధి వైపరీత్యం.