టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న టీమ్‌ఇండియా ఇప్పుడు అదే జట్టుపై 3-0 తేడాతో గెలుపొంది సిరీస్ క్లీన్‌స్వీప్(ind vs nz t20 2021) చేసింది. దీంతో రోహిత్(rohit sharma captaincy) పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే అదరగొట్టాడు. ఈ విజయంపై స్పందించిన రోహిత్.. మ్యాచ్‌కు ముందు ఒకసారి పిచ్‌ను పరిశీలిస్తే ఏం చేయాలనే విషయంపై స్పష్టత వస్తుందన్నాడు.
"కివీస్‌తో మ్యాచ్‌లో మంచు ప్రభావం అధికంగా ఉండటం వల్ల బంతి.. బ్యాట్‌పైకి బాగా వచ్చింది. మా బ్యాటింగ్ బృందం ఎలా ఆడాలనేదానిపై ముందే ప్రణాళికలు వేసుకున్నాం. అయితే, అది బాగా ఉపయోగపడిందని నేను అనుకోను. మిడిల్ ఆర్డర్‌లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ ఈరోజు ఆడకపోయినా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్‌కు ఈరోజు మినహా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సిరీస్ మొత్తంలో మా స్పిన్నర్లు బాగా రాణించారు. అశ్విన్, అక్షర్ బౌలింగ్ చేసిన తీరు బాగుంది. చాహల్ లయ అందుకున్నాడు. వెంకటేశ్ కూడా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు" అని రోహిత్(rohit sharma captaincy) వివరించాడు.