తెలంగాణ

telangana

ETV Bharat / sports

NZ vs ENG: 'తొలి టెస్టులో ఫలితం రావడం పక్కా' - న్యూజిలాండ్-ఇంగ్లాండ్ తొలి టెస్టు

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ తొలి టెస్టుపై సానుకూల వ్యాఖ్యలు చేశాడు కివీస్ బౌలింగ్ కోచ్ షేన్ జర్గన్​సేన్. వర్షం వల్ల ఒక రోజు ఆట జరగకపోయినా ఈ మ్యాచ్​లో ఫలితం వచ్చే అవకాశముందని తెలిపాడు.

shane jurgensen, new zealand bowling coach
షేన్​ జర్గన్​సేన్​, కివీస్ బౌలింగ్ కోచ్

By

Published : Jun 5, 2021, 12:08 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టు ఫలితంపై సానుకూల వ్యాఖ్యలు చేశాడు కివీస్​ బౌలింగ్ కోచ్ షేన్ జర్గన్​సేన్​. వర్షం కారణంగా ఒక రోజు ఆట తుడిచిపెట్టుకుపోయినా.. ఈ మ్యాచ్​లో ఫలితం రావడానికి ఆస్కారముందని పేర్కొన్నాడు.

"ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో భాగంగా వర్షం కారణంగా మూడో రోజు ఆటలో ఒక్క బంతి పడలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​ డ్రాగా ముగుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, మేం ఆటపై ఆధిపత్యం సాధించడానికి కావాల్సినన్ని పరుగులు చేశాం. వర్షం వల్ల ఒకరోజు ఆట వృథా అయింది. అయినప్పటికీ ఈ రెండు రోజుల్లో ఫలితం వస్తుంది. అది కొంత కష్టమే అయినప్పటికీ ఆ తరహా ఆలోచనే ఉండాలి. ఈ మ్యాచ్​లో ఇప్పటివరకు మాదే పై చేయి" అని జర్గన్​సేన్​ తెలిపాడు.

ఇంగ్లాండ్​తో తొలి టెస్టులో కివీస్ తొలి ఇన్నింగ్స్​లో 378 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 111 రన్స్​ సాధించింది. తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యానికి మరో 267 పరుగులు వెనుకబడి ఉంది రూట్ సేన.

ఇదీ చదవండి:వార్నర్.. ఈ సారి టైగర్​ ష్రాఫ్​లా!

ABOUT THE AUTHOR

...view details