ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఐసీసీ కీలక ప్రకటన - ICC latest update
16:19 September 21
ఆ రెండు ఫైనల్స్ లండన్‌లోనే
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఐసీసీ కీలక ప్రకటన చేసింది. 2021-23, 2023- 25ఫైనల్ మ్యాచ్‌లను ఏ స్టేడియంలో నిర్వహించబోయేది తెలిపింది. ఐసీసీ 2021-23 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ను లండన్‌లోని ఓవల్ మైదానంలో నిర్వహిస్తామని పేర్కొంది. ఇక 2023- 25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వేదికను లార్డ్ వేదికగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
"ఐసీసీ ఛాంపియన్‌షిప్ తర్వాతి సీజన్ ఫైనల్‌ను ఓవల్‌లో నిర్వహించేందుకు ఆనందంగా ఉంది. అలాగే 2025 సీజన్ తుదిపోరుకు లార్డ్ వేదికగా నిలవనుంది. మొదటిసారి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌథాంప్టన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ను అభిమానులు భారీ సంఖ్యలో ఆస్వాదించారు. ఈసారి ఓవల్ వేదికగా జరిగే మ్యాచ్‌నూ వీక్షిస్తారని ఆశిస్తున్నా. మద్దతుగా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్‌బోర్డు, మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌లకు ధన్యవాదాలు" అని ఐసీసీ చీఫ్ తెలిపారు.
ఇకపోతే ప్రస్తుతం ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో 84పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు 6మ్యాచ్‌లు గెలిచింది, 1 ఓడిపోయింది. మూడు డ్రా చేసుకుంది. 6మ్యాచ్‌లు గెలిచి 72పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ భారత్ -న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ టీమ్ విజేతగా నిలిచింది.