టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు సుమిత్ అంటిల్(tokyo paralympics sumith antil). ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ అతడికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. "నీ ప్రదర్శనతో దేశానికి కీర్తి తెచ్చావు. ఈ విజయంతో భారతదేశ యువత నీ నుంచి స్ఫూర్తి పొందుతారు. సుమిత్ రికార్డు ప్రదర్శనతో దేశం గర్వపడుతోంది. నువ్వు ఇలాగే భవిష్యత్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయాలి అని కోరుకుంటున్నా" అని మోదీ అభినందించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతున్న సమయంలో అమిత్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ వీడియోను కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
మోదీ ప్రశంసలతో సుమిత్ భావోద్వేగం
టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రో(tokyo paralympics javelin throw) విభాగంలో బంగారు పతకాన్ని ముద్దాడిన సుమిత్‌ను ప్రశంసించారు ప్రధానమంత్రి మోదీ. అతడికి ఫోన్ చేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానితో మాట్లాడిన సుమిత్ భావోద్వేగానికి గురయ్యాడు.
సోమవారం (ఆగస్టు 30) జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో చరిత్ర సృష్టించాడు సుమిత్(Sumith Javelin Throw). ఎఫ్ 64 విభాగంలో 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఈ క్రమంలో మూడుసార్లు ప్రపంచ రికార్డు(javelin throw world record) నెలకొల్పాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అతడు.. రెండో ప్రయత్నంలో 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే తిరగరాశాడు. ఇక ఐదో ప్రయత్నంలో మరింత వేగంతో ఈటెను విసరగా అది 68.55 మీటర్లు దూసుకెళ్లడం వల్ల కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో సుమిత్ గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఏడు పతకాలు వచ్చాయి. అందులో రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఒక కాంస్య పతకాలు ఉన్నాయి.