టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈతో పాటు ఒమన్ వేదికగా టోర్నీ జరగనుందని వెల్లడించింది. అయితే ఆతిథ్య హక్కుల మాత్రం భారత్‌కే ఉంటాయని స్పష్టం చేసింది.
టోర్నీ నిర్వహణ నాటికి దేశంలో కొవిడ్ పరిస్థితి ఎలా ఉండనుందో చెప్పలేమని.. అందుకే టీ20 ప్రపంచకప్‌ను భారత్ నుంచి తరలించాలని బీసీసీఐ.. ఐసీసీకి విన్నవించింది. అందుకు అనుగుణంగా షెడ్యూల్‌తో పాటు వేదికను ప్రకటించింది ఐసీసీ.
ప్రణాళిక ఇలా..
టీ20 ప్రపంచకప్‌ను అక్టోబర్ 17న ప్రారంభించాలని ఐసీసీ నిర్ణయించింది. టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్లో టాప్-8లో లేని బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యూ గినియా తలపడతాయి.ఈ ఎనిమిది జట్లలో నాలుగు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. తొలి రౌండ్ మ్యాచ్‌లను యూఏఈతో పాటు ఒమన్‌లో నిర్వహిస్తారు. పొట్టి కప్‌కు ముందు వరకు దుబాయ్, అబుదాబి, షార్జా మైదానాల్లో ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఆ పిచ్‌లకు మెరుగులు దిద్ది వాటిని సూపర్-12 దశ నుంచి టీ20 ప్రపంచకప్ కోసం వినియోగిస్తారు. టాప్-8లో ఉన్న ప్రధాన జట్లు అక్టోబర్ 24 నుంచి బరిలోకి దిగుతాయి.
ఇదీ చదవండి:ICC Rankings: టాప్-5లోకి మిథాలీ- నం.1గా బ్యూమంట్