తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇంగ్లీష్​ టీమ్ భయపడింది.. భారత్​ను గెలిపిస్తానేమో అని'

భారత్​, ఇంగ్లాండ్​ మధ్య మూడో టెస్టు(India vs Eng) జరుగుతుండగా భారత్​ తరఫున బ్యాటింగ్​ చేస్తానని మైదానంలోకి వచ్చిన డేనియల్ జార్వో(Jarvo 69) అనే అభిమాని.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తాను మైదానంలోకి వెళ్లగానే ఇంగ్లీష్ టీమ్​ భయపడిందని అన్నాడు.

Prankster Jarvo
డేనియల్ జార్వో

By

Published : Sep 3, 2021, 12:17 PM IST

భారత్,​ ఇంగ్లాండ్​ మధ్య రెండో, మూడో టెస్టు(Ind vs Eng 3rd test 2021) జరుగుతుండగా మైదానంలోకి వచ్చి నవ్వులు పూయించినడేనియల్ జార్వో(ఇంగ్లాండ్) అనే అభిమాని.. తాజాగా ఓ ఇంటర్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాను మైదానంలోకి వెళ్లినప్పుడు ఇంగ్లీష్​ జట్టు భయపడిందని అన్నాడు. తానెక్కడ టీమ్​ఇండియాను గెలిపిస్తాడో అని ఇంగ్లాండ్​ టీమ్​ ఆటగాళ్లు భావించారని పేర్కొన్నాడు.

టీమ్​ఇండియాకు తాను నిజమైన అభిమానిని అని, ఇది పబ్లిసీటీ కోసం చేసింది కాదని చెప్పుకొచ్చాడు జార్వో(Jarvo Ind vs Eng). ప్రాక్టీస్​ సమయంలో భారత జట్టు ఆటగాళ్లు తనతో మాట్లాడిన విధానం నచ్చిందని చెప్పాడు. అప్పటినుంచే భారత జట్టుకు అభిమానిగా మారినట్లు వెల్లడించాడు.

భారత జట్టులో సిరాజ్​, రవిచంద్రన్ అశ్విన్​ తన ఫేవరేట్ ఆటగాళ్లని జార్వో(Jarvo Cricketer) ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రపంచకప్​లోనైనా సరే.. ఇంగ్లాండ్, భారత్​ మధ్య మ్యాచ్​ జరిగితే తన మద్దతు భారత్​కే అని పేర్కొన్నాడు.

క్రేజీ చేష్టలు..

ఓ వైపు ఉత్కంఠగా మ్యాచ్​ సాగుతుంటే.. జార్వో మైదానంలోకి బ్యాట్​ పట్టుకుని భారత్​ తరఫున ఆడటానికి వచ్చాడు. భారత జెర్సీని ధరించి బ్యాటింగ్​కు దిగడం, భద్రతా సిబ్బందిని పరుగులు పెట్టించడం వంటివి చేశాడు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయ్యాయి. అనంతరం.. హెడింగ్లే స్టేడియం యాజమాన్యం జార్వోపై జీవితకాల నిషేధం విధించింది. ఇకపై ఎప్పుడూ అతడు మైదానానికి రాకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:IndvsEng: ఆ అభిమానిపై జీవితకాల నిషేధం

ABOUT THE AUTHOR

...view details