టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో(Ravi Shastri News) పాటు సహాయ సిబ్బందిలో మరో ముగ్గురు కొవిడ్ బారిన పడ్డ నేపథ్యంలో భారత్, ఇంగ్లాండ్(Ind vs Eng Test) మధ్య శుక్రవారం ఆరంభం కావాల్సిన అయిదో టెస్టును ఆపేశారు. ఆటగాళ్లలో ఎవరికీ కరోనా సోకినట్లు తేలకపోయినప్పటికీ.. గత కొన్ని రోజులుగా సహాయ సిబ్బందితో కలిసి మెలిసి సాగిన నేపథ్యంలో ఈ ఆందోళనకర మానసిక స్థితిలో మ్యాచ్ ఆడటం కష్టమని భారత జట్టు స్పష్టం చేయడంతో మ్యాచ్‌ను ప్రస్తుతానికి రద్దు చేయక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ(BCCI News) కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.
"ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చాం. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయి" అని బీసీసీఐ కార్యదర్శి జై షా మీడియాకు వెల్లడించాడు. మరోవైపు ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ మాట్లాడుతూ.. "బీసీసీఐ మాకు ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించడం శుభ పరిణామం. అయితే ఈ మ్యాచ్ ప్రస్తుత సిరీస్‌లోనే భాగంగా ఉంటుందా.. లేక వేరే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌గా ఉంటుందా అన్నది ఇప్పుడే చెప్పలేం" అన్నాడు.
ఈ మూడింట్లో ఏది?