కొవిడ్ బాధితులను కాపాడే క్రమంలో వైద్యుల ముఖాల్లో కనిపిస్తున్న నిస్సహాయత తనను చంపేస్తోందని టీమ్‌ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. దేశవ్యాప్తంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మధ్యలోనే టోర్నీని వీడాడు. చెన్నైకి వచ్చి తన కుటుంబ సభ్యులను చూసుకున్నాడు. మహమ్మారి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెలుసు కాబట్టే కొవిడ్‌పై చురుగ్గా సామాజిక మాధ్యమాల్లో తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నాడు.