Test Team Rankings 2024:ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌లోకి దూసుకెళ్లింది. తాజాగా పాకిస్థాన్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం వల్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పుంజుకుంది. ప్రస్తుతం ఆసీస్ 118 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, టీమ్ఇండియా (117 రేటింగ్స్) ఒక్క పాయింట్ తేడాతో రెండో ప్లేస్‌లోకి పడిపోయింది.
'స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం వల్ల ఆస్ట్రేలియా మళ్లీ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. ఇక సౌతాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులో ఓడిన భారత్ రెండో స్థానానికి పడిపోయింది' అని ఐసీసీ పేర్కొంది.
ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న జట్లు
- తొలి స్థానం- ఆస్ట్రేలియా- 118 రేటింగ్స్
- రెండో స్థానం- భారత్- 117 రేటింగ్స్
- మూడో స్థానం- ఇంగ్లాండ్- 115 రేటింగ్స్
- నాలుగో స్థానం- సౌతాఫ్రికా- 106 రేటింగ్స్
- ఐదో స్థానం- న్యూజిలాండ్- 95 రేటింగ్స్
Aus vs Pak 3rd Test:ఆస్ట్రేలియా స్వదేశంలో పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన ఆసిస్, మూడో మ్యాచ్‌లోనూ గెలుపు దిశగా పయనిస్తోంది. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ (313-10)లో అదరగొట్టిన పాక్, రెండో ఇన్నింగ్స్‌లో తడపడింది. మూడో రోజు ముగిసేసరికి పాక్ 68-7తో నిలిచింది. ప్రస్తుతం పాకిస్థాన్ 82 పరుగులు ఆధిక్యంలో కొనసాగుతోంది.