Test cricket fab four : టెస్టు క్రికెట్ అంటే ఒకప్పుడు గంటలతరబడి క్రీజులో పాతుకుపోయి ఆడేవారు ఆటగాళ్లు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. చాలా మంది దూకుడు ప్రదర్శిస్తున్నారు. నాలుగు లేదా ఐదో రోజుకు మ్యాచ్ చేరిందంటే అదో ఆశ్చర్యంగా కనిపిస్తోంది. వాస్తవానికి ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్లు ఫ్యాబ్ 4 అంటే.. గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్. అయితే గత రెండేళ్ల కాలంలో గణాంకాలను గమనిస్తే.. ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ భారీగా పరుగులు చేస్తూ టాప్ బ్యాటర్‌గా దూసుకొచ్చాడు. 2021లో ఈ సమయానికి విరాట్ కోహ్లీ 27, స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 24, జో రూట్ 17 సెంచరీలతో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం జో రూట్ ఏకంగా 13 సెంచరీలు బాదేసి వారందరినీ అధిగమించాడు. మిగతా ఇద్దరు చెరో ఐదేసి శతకాలు బాదగా.. కోహ్లీ మాత్రం ఒకే ఒక్క సెంచరీ బాదాడు.
Root test centuries :రూట్ గణాంకాలు.. ఇంగ్లాండ్ 'బజ్‌బాల్' క్రికెట్‌ను త్వరగా అలవర్చుకొని.. భారీగా పరుగులు సాధిస్తున్నాడు రూట్. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్.. తొలి టెస్టులోనూ రూట్ (118*) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అతడికిది 30వ టెస్టు సెంచరీ. అలా గత రెండేళ్ల కాలంలో (2021-2023) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో రూట్‌దే అగ్రస్థానం. మొత్తం 62 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాది.. 3,299 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. యావరేజ్ 58.91గా ఉంది. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 228. ఈ రెండేళ్ల కాలంలో మరే ఇతర బ్యాటర్ కూడా 2 వేల పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు.
Kohli Test centuries : అన్ని ఫార్మాట్లలోనూ కలిపి అత్యధిక శతకాలు చేసిన రెండో బ్యాటర్‌గా కొనసాగుతున్న టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. గత రెండేళ్లలో 38 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 31.37 సగటుతో 1,161 పరుగులు మాత్రమే సాధించాడు. సగటు 31.37గా ఉంది. ఈ రెండేళ్ల కాలంలో రూట్ అయితే ఏకంగా 13 సెంచరీలు బాదాడు. కానీ కోహ్లీ మాత్రం ఒక్కటే చేశాడు.
kane williamson test centuries : గాయం కారణంగా కివీస్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఎక్కువ టెస్టులు ఆడలేదు. ఈ రెండేళ్ల కాలంలో 12 టెస్టులు ఆడాడు. 69.27సగటుతో 1,247 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 238గా ఉంది.
Steve smith test centuries : ఇక స్టీవ్ స్మిత్ రీసెంట్గా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ బాదాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ మినహా.. ఇప్పటి వరకు గత రెండేళ్ల కాలంలో 23 మ్యాచుల్లో 36 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 55.16 సగటుతో 1,710 పరుగులను సాధించాడు. ఇందులో కేవలం ఐదు శతకాలు, 8 అర్ధ