21వ శతాబ్దానికి సుదీర్ఘ ఫార్మాట్లో గొప్ప బ్యాట్స్‌మన్(greatest Test batsman)గా సచిన్ తెందుల్కర్(Sachin Tendulkar) నిలిచాడు. దీనిపై నిర్వహించిన ఓ సర్వేలో లిటిల్ మాస్టర్‌కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇందులో మాస్టర్ బ్లాస్టర్‌కు పోటీగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర నిలిచాడు. అయినా చివరకు తెందుల్కర్నే విజయం వరించింది.
"ఇది చాలా కఠినమైన విషయం. టెస్టుల్లో కుమార సంగక్కర, సచిన్ తెందుల్కర్ ఇద్దరూ ఐకాన్లుగానే పేరు పొందారు. కానీ, 21వ శతాబ్దపు గొప్ప బ్యాట్స్‌మన్‌గా నేను మాత్రం సచిన్‌కే ఓటు వేస్తాను."
-సునీల్ గావస్కర్, భారత క్రికెట్ దిగ్గజం.
టెస్ట్‌ల్లో తెందుల్కర్ మొత్తం 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. రన్స్‌తో పాటు శతకాల పరంగా సచిన్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పరుగుల విషయంలో అతనికి చేరువలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ దగ్గర్లో ఉన్నాడు. తెందుల్కర్ కంటే 2,543 పరుగులు తక్కువగా నమోదు చేశాడు. ఇక సెంచరీల విషయానికొస్తే దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్.. సచిన్‌కు చేరువలో ఉన్నాడు. అతడు టెస్టుల్లో 45 శతకాలు బాదాడు.