మదర్స్ డే సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అమ్మపై ఓ పద్యం రాశాడు.
"తల్లులకు ఎంత వయసు వచ్చినప్పటికీ.. పిల్లల కోసం పరితపిస్తూనే ఉంటారు. నా జీవితంలో నాకు ఇద్దరు వ్యక్తులు తల్లులతో సమానం. వారిద్దరూ నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటారు. అయి, కాకు.. ఇద్దరికీ మదర్స్ డే శుభాకాంక్షలు" అంటూ బ్యాటింగ్ దిగ్గజం ట్వీట్ చేశాడు. కొన్ని పాత ఫొటోలను షేర్ చేశాడు.