Legends league cricket 2022: దిగ్గజ సచిన్ తెందూల్కర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది లెజెండ్స్ క్రికెట్ లీగ్లో ఆడకూడదని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది.
రిటైర్మెంట్ అయిన క్రికెటర్ల కోసం ప్రతిఏటా లెజెండ్స్ క్రికెట్ లీగ్ నిర్వహిస్తుంటారు. ఇటీవల భారత జట్టును కూడా ప్రకటించారు.
అయితే గతేడాది సీజన్ పూర్తయిన తర్వాత యువరాజ్ సింగ్, పఠాన్ బ్రదర్స్ తదితరులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం వల్లే ఈసారి సచిన్, ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీమ్ఇండియా లెజెండ్స్ జట్టులో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఉన్నారు.