టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకు.. 36 రన్స్ తేడాతో గెలిచింది. కేఎల్ రాహుల్(74) హాఫ్ సెంచరీతో మెరిసినా వృథా అయిపోయింది. మిగాత బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు బ్యాటింగ్‌కు దిగలేదు.
ప్రత్యర్థి జట్టులో నిర్ణీత 20 ఓవర్లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు స్కోర్ చేసింది. నిక్ హాబ్సన్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డీ ఆర్సీ షార్ట్ 52 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ జోడిని విడదీసేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో నిక్ హాబ్సన్..అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా 125 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.