తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​ బౌలర్​ అద్భుతం.. రెండో టీ20 మ్యాచ్​ హైలైట్స్​ ఇవే

Ind vs west indies: సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో విండీస్ అదరగొట్టింది. భారత్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓ సారి ఈ మ్యాచ్​ విశేషాలను చూద్దాం..

Teamindia Westindies second T20
విండీస్‌ బౌలర్‌ మెకా

By

Published : Aug 2, 2022, 11:06 AM IST

ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌, వెస్టిండీస్‌ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి 1-1తో సమంగా నిలిచాయి. విండీస్‌ బౌలర్‌ మెకాయ్‌ (6/17) ధాటికి టీమ్‌ఇండియా 138 పరుగులకే ఆలౌటైంది. అయితే చివరి ఓవర్‌ దాకా సాగిన మ్యాచ్‌లో విండీస్‌ అతికష్టం మీద గెలవగలిగింది. ఓ సారి ఈ మ్యాచ్​ విశేషాలను చూద్దాం..

భారత్‌, విండీస్‌ రెండో టీ20 మ్యాచ్‌ విశేషాలు..

  • టీ20ల్లో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన ఆరో బౌలర్‌ మెకాయ్‌. అతడి కంటేమందు దీపక్‌ చాహర్‌ (6/7), అజంతా మెండిస్ (6/8, 6/16), యుజ్వేంద్ర చాహల్ (6/25), అగర్ (6/30) ఉన్నారు.
  • భారత్‌పై అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన బౌలర్‌ కూడా మెకాయ్‌ కావడం విశేషం. గతంలో వహిందు హసరంగ (4/9), మిచెల్‌ సాంట్నర్ (4/11), డారెన్ సామీ (4/16) ఉన్నారు.
  • టీ20ల్లో విండీస్‌ ప్లేయర్‌ అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన బౌలర్‌ మెకాయ్‌. అంతకుముందు కీమో పాల్ (5/15), డారెన్ సామీ (5/26), జాసన్ హోల్డర్ (5/27), థామస్‌ (5/38) ఉన్నారు.

అమ్మకు అంకితం..ఈ మ్యాచ్​లో6/17తో మెరిసిన విండీస్‌ బౌలర్‌ మెకాయ్‌కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది. "ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను మా అమ్మకు అంకితమిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతూ ఉండే ఆమె నన్ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేది. అందుకే ఈ అవార్డును అమ్మకిస్తున్నా. మొదటి బంతికే వికెట్ తీయడం ఎప్పుడూ బ్యాటర్‌పై ఒత్తిడిని పెంచినట్లు అవుతుంది. పవర్‌ప్లేలో వికెట్లు తీసేందుకు చూస్తుంటా. గత మ్యాచ్‌ (మొదటి టీ20)లో అతిగా ఆలోచించడం వల్లే సరైన ప్రదర్శన చేయలేకపోయా. ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా బౌలింగ్‌పైనే దృష్టిపెట్టా. ప్రతి మ్యాచ్‌ నాకు సవాల్‌తో కూడుకున్నదే. అయితే ఇలాంటి మ్యాచుల్లో ఆడినప్పుడు వచ్చే అనుభవం భవిష్యత్తులో అక్కరకొస్తుంది" అని మెకాయ్‌ పేర్కొన్నాడు.

మొకాయ్​ రికార్డు:

  • టీ20 క్రికెట్‌లో ఆరు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా ఒబెద్‌ మెకాయ్‌(6/17) నిలిచాడు. ఇంతకముందు ఈ ఘనత నలుగురు బౌలర్లు అందుకోగా.. అజంతా మెండిస్‌ రెండుసార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. దీపక్‌ చహర్‌(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్‌(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్‌ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్‌(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్‌ ఆగర్‌(6/30, న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్‌ను అందుకున్నారు.
  • ఇక టీమ్​ఇండియాపై టీ20ల్లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లలో ఒబెద్‌ మెకాయ్‌ తొలి స్థానంలో నిలిచాడు. మెకాయ్‌ తర్వాత వనిందు హసరంగా(4/9), మిచెల్‌ సాంట్నర్‌(4/11), డారెన్‌ సామీ(4/16) ఉన్నారు.
  • ఇక వెస్టిండీస్‌ తరపున టీ20ల్లో బెస్ట్‌ బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచిన బౌలర్ల జాబితాలోనూ మెకాయ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. మెకాయ్‌ తర్వాత కీమో పాల్‌(5/15), డారెన్‌ సామి(5/26), జాసన్‌ హోల్డర్‌ (5/27), ఒషేన్‌ థామస్‌(5/28) ఉన్నారు.

మా పంథా మార్చుకోం:మ్యాచ్​ గురించి కెప్టెన్​ రోహిత్​ మాట్లాడుతూ.. "తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు స్కోరు బోర్డుపై కావాల్సినన్ని పరుగులను ఉంచలేకపోయాం. పిచ్‌ బాగానే స్పందించినా మేం సరిగా బ్యాటింగ్‌ చేయలేకపోయాం. అయితే ఒక్కోసారి అనుకున్నవిధంగా ఆడలేం. లోపాలను అధిగమించి పాఠాలను నేర్చుకుంటాం. ప్రతి ఒక్కరికి నేర్చుకునేందుకు అవకాశాలు వస్తుంటాయి. ఇక చివరి ఓవర్‌ గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తారని తెలుసు. అప్పటికి భువి అందుబాటులో ఉన్నప్పటికీ అవేశ్‌ ఖాన్‌కు బంతిని ఇవ్వడంపై వ్యాఖ్యలు వస్తుంటాయి. అయితే డెత్‌ ఓవర్లలో యువ బౌలర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని భావించాం. కాస్త తడబాటుకు గురైనప్పటికీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 138 పరుగుల లక్ష్యాలను ఇలాంటి పిచ్‌పై 14 ఓవర్లలోపే ఛేదించే అవకాశం ఉన్నా మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లడంలో బౌలర్లు సఫలీకృతమయ్యారు. తదుపరి మ్యాచుల్లో మా బ్యాటింగ్‌పై దృష్టిసారిస్తాం. అయితే ఇలాంటి విధానంతోనే బ్యాటింగ్‌ను కొనసాగిస్తాం. ఏదో ఒక మ్యాచ్‌లో ఇలా జరిగిందని కంగారుపడిపోయేది లేదు. ఒక్క ఓటమితో మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.

మాకెంతో కఠినమైన సవాళ్లు: పూరన్‌ మాట్లాడుతూ.. "గత కొంతకాలంగా మాకు కఠినమైన సమయం నడుస్తోంది. చాలా మ్యాచ్‌ల్లో చివరి వరకూ వచ్చి ఓడిపోతున్నాం. ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. మెకాయ్‌ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. టీ20ల్లో బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడతారు. అలాంటి సమయంలో బౌలింగ్‌ వేయడం సవాళ్లతో కూడుకున్నదే. మ్యాచ్‌ చివరి ఓవర్‌ వరకూ వెళ్లినా విజయం సొంతం కావడం సంతోషం. మ్యాచ్‌ విజయంలో బ్రాండన్‌ కింగ్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇక నేను, హెట్మయేర్ ఎక్కువ బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉంది. గాయపడి మళ్లీ జట్టులోకి వచ్చిన థామస్ తన సొంత మైదానంలో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మాకు విజయం సాధించి పెట్టడంలో మెకాయ్‌ బౌలింగ్ ప్రదర్శనే కీలకం. మరీ ముఖ్యంగా ధాటిగా ఆడే దినేశ్‌ కార్తిక్‌కు బౌలింగ్‌ చేసిన విధానం అద్భుతం. ఫుల్‌ అండ్‌ లెంగ్త్‌ బౌలింగ్‌తో కార్తిక్‌ను అడ్డుకోవడంలో మెకాయ్‌ సక్సెస్‌ అయ్యాడు" అని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: Commonwealth Games: స్విమ్మర్​ సూపర్​ రికార్డ్​.. ఏకంగా 11 గోల్డ్ మెడల్స్..

ABOUT THE AUTHOR

...view details