IND VS Ireland First T20 : ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మొదటి టీ20తో టీమ్ఇండియా శుభారంభం చేసింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అంతకుముందు జరిగిన వరుస ఐదు మ్యాచుల్లోనూ టీమ్ఇండియాదే విజయం. దీంతో.. ఐర్లాండ్‌పై వరుసగా ఆరో మ్యాచ్‌ను భారత్ జట్టు గెలపొందినట్టైంది.
Bumrah VS Ireland : అయితే ఈ సిరీస్‌కు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలోని టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో మొదట బౌలింగ్‌లో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌తోనే ప్రసిద్ధ్, సిక్సర్ కింగ్ రింకూ సింగ్ టీ20 అరంగేట్రం చేశారు. దాదాపు ఏడిదా తర్వాత టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా (2/24) తన మునుపటి ఫామ్‌నే చూపించాడు. మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసిన అతడు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ను సొంతం చేసుకున్నాడు.
ఇక మ్యాచ్ విజయం తర్వాత బుమ్రా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ.. కొన్ని అంశాల్లో మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని అన్నాడు. "నేషనల్ క్రికెట్ అకాడమీలో చాలా సెషన్లు ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో మంచిగా ఆడించడం హ్యాపీగా ఉంది. అందుకే కొత్తగా అన్నట్టుగా ఏమీ అనిపించలేదు. అందుకు కారణం సిబ్బంది నాకు అందిచిన సహాయ సహకారమే. ఇక ఈ మ్యాచ్‌లో పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా మారింది. కాకపోతే వర్షం వల్ల పరిస్థితులు చాలా వేగంగా మారాయి. అయినా చివరికి మేమే విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఐర్లాండ్ కూడా ఎన్నో క్లిష్టపరిస్థితుల నుంచి తేరుకుని ఈ మ్యాచ్‌లను ఆడుతోంది. ఆ జట్టులోని ప్లేయర్లు మంచిగా ఆడారు. ఇక మేము గెలిచినప్పటికీ కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. మా టీమ్‌లో ప్రతి ఒక్కరూ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఐపీఎల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ వారికి ఇక్కడ బాగా ఉపయోగపడింది. ఇలానే మిగతా మ్యాచుల్లోనూ బాగా ఆడి గెలుస్తాం" అని బుమ్రా పేర్కొన్నాడు.