నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరగనుంది. ఆసియాకప్‌లో ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టిన టీమ్ఇండియా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో కూడా పరాజయం చవిచూసింది. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న వేళ భారత్ జట్టుకు ఇంకా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా పేస్ బౌలర్లు చివరి ఓవర్లలో భారీగా పరుగులిస్తుండటం టీమ్ఇండియాను కలవరపెడుతోంది. వెన్నునొప్పి కారణంగా ఆసియాకప్‌కు దూరమైన పేసర్ బుమ్రా ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపికైనా తొలిమ్యాచ్‌లో అతన్ని టీమ్‌మేనేజ్‌మెంట్ ఆడించలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా లేడా అనేది సందేహంగా మారింది. టీ20 ప్రపంచకప్ కంటే ముందు టీమ్ఇండియా ఇంకా 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రా రాక కీలకంగా మారింది. మొహాలీ టీ20లో భారత పేసర్లు 14 ఓవర్లలో ఏకంగా 150 పరుగులు సమర్పించుకున్నారు. పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన పేసర్ భువనేశ్వర కుమార్ ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. అటు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పేలవ ఫామ్‌తో సతమతమౌతున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. చాహల్ స్థానంలో అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. మరోవైపు రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. మొహాలీ టీ20లో 3 వికెట్లతో సత్తా చాటాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది. మూడు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్యాటింగ్‌లో మాత్రం టీమ్ఇండియా పటిష్ఠంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్‌కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరిగినా..కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడారు. భారత్ స్కోరును 200 పరుగులు దాటించారు. దినేష్ కార్తీక్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. కార్తీక్‌కు మరో అవకాశం ఇస్తారా లేదా రిషబ్ పంత్‌కు తుదిజట్టులో చోటు కల్పిస్తారా అనేదా తేలాల్సి ఉంది.