ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్(t20 world cup news)లో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(ind vs pak t20) చేతిలో ఓటమిపాలవ్వడంపై దిగ్గజ ఆటగాళ్లు స్పందించారు. మ్యాచ్ అనంతరం జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో మాజీ సారథి సునీల్ గావస్కర్(sunil gavaskar latest news) మాట్లాడుతూ.. ఇది భారత జట్టుకు అత్యంత ఘోర పరాభవమని చెప్పాడు. అయితే, రాబోయే మ్యాచ్‌ల్లో భారత్ పుంజుకుంటుందని, ప్రపంచకప్‌లో మిగతా జట్లను ఓడించి ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ఇకపై ఆడాల్సిన మ్యాచ్‌ల మీద దృష్టిసారించాలని సూచించాడు.
'టీమ్ఇండియా చేయాల్సింది చాలా ఉంది' - సునీల్ గావస్కర్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్(t20 world cup news)లో భాగంగా పాకిస్థాన్ చేతిలో భారత్(ind vs pak t20)ఓడిపోవడం పట్ల పలువురు నిరాశచెందారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన మాజీలు.. టీమ్ఇండియా మరింత బలంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag latest news) కూడా ఈ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. పాకిస్థాన్ బాగా ఆడిందని మెచ్చుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో శుభారంభం చేసిందన్నాడు. అలాగే టీమ్‌ఇండియా ఈ ఓటమి నుంచి బలంగా పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాడు.
ఈ క్రమంలోనే వీవీఎస్ లక్ష్మణ్(vvs laxman latest news) కూడా పాకిస్థాన్‌ను అభినందిస్తూనే టీమ్‌ఇండియా బలంగా పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో టీమ్‌ఇండియాతో వరుస ఓటములను దాటడానికి పాకిస్థాన్ అద్భుతమైన ప్రదర్శన చేసిందని, షహీన్ అఫ్రిది ఆదిలోనే రెండు వికెట్లు తీసి పాక్‌ను ఆధిపత్యంలో నిలబెట్టాడని వీవీఎస్ ప్రశంసించాడు. అలాగే ఛేదనలో ఆ జట్టు ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ అత్యద్భుతంగా ఆడారన్నాడు. ఇకపై టీమ్‌ఇండియా చేయాల్సింది చాలా ఉందని, అయితే.. బలంగా పుంజుకునే శక్తి కోహ్లీసేనకు ఉందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశాడు.