భారత క్రికెట్ జట్టులో ఉన్న క్రికెటర్స్ అందరితో పాటు టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. అతడు చేసే వర్కౌట్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో పంచుకుంటాడు కూడా. ఇక అతడి డైట్ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తాడు. ఇవి కేవలం ఆహారానికే వర్తిస్తాయనుకుంటే పొరపాటే.. అతడు మినరల్ వాటర్‌కు బదులు 'బ్లాక్ వాటర్'ను సేవిస్తాడట. ఈ బాటిల్ లీటర్ ధర తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు మరి. ఎందుకంటారా.. మినరల్ వాటర్ బాటిల్ లీటర్ రూ.20-40 ఉంటే.. బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ.3000-4000 ఉంటుందట. ఇది ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్ వాటర్ తాగడం మొదలెట్టాడు కోహ్లీ. కేవలం విరాట్ మాత్రమే కాదు, బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్ ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.
అసలేమిటీ 'బ్లాక్ వాటర్'.. వాటి లాభాలు