తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, రోహిత్ సెలబ్రేషన్స్​ మాములుగా లేవుగా.. వీడియో చూశారా? - టీమ్​ఇండియా సిరీస్​ గెలుపు

ఆస్ట్రేలియాపై సిరీస్​ నెగ్గిన నేపథ్యంలో టీమ్​ఇండియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

kohli rohith
కోహ్లీ రోహిత్

By

Published : Sep 26, 2022, 3:24 PM IST

Updated : Sep 26, 2022, 3:31 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్​లో నెగ్గి సిరీస్​ను సొంతం చేసుకుంది టీమ్​ఇండియా. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. హైదరాబాద్‌ క్రీడాభిమానులకు అసలైన క్రికెట్‌ మజాను అందించింది. దాదాపు మూడేళ్ల అనంతరం ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగడం.. ఈ విజయంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అయితే ఈ గెలుపు నేపథ్యంలో డగౌట్‌ ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ కోహ్లీల సంబరాలు ఆకట్టుకున్నాయి. చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికే సిక్సర్‌ బాదిన కోహ్లీ(63) సమీకరణాన్ని తేలిక చేశాడు. కానీ తర్వాతి బంతికే ఔటైపోయాడు. ఆ సమయంలో డగౌట్‌ ముందు మెట్లపై నిల్చొని రోహిత్‌.. విరాట్‌ను అభినందించాడు. అనంతరం వీరిద్దరూ మెట్లపైనే కూర్చొని చివరి ఓవర్‌ను వీక్షించారు. టీమ్‌ఇండియా విజయం సాధించగానే ఆనందంతో ఊగిపోతూ ఒకరినొకరు కౌగిలించుకొన్నారు. రోహిత్‌ను దగ్గరికి తీసుకొని కోహ్లీ అభినందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం వీరిద్దరి సంబరాల వీడియో వైరల్‌గా మారింది. కాగా, ఆసీస్‌ విధించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని 4 వికెట్లే కోల్పోయి ఛేదించిన టీమ్‌ఇండియా.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది.

ఇదీ చూడండి: టీ20 ర్యాంకింగ్స్​లో భారత్​ టాప్.. ఉప్పల్​ విజయం ఇచ్చిన జోష్​తో...

Last Updated : Sep 26, 2022, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details