Teamindia WTC Points: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియాకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో ఓడి సిరీస్‌ను పంచుకోవాల్సి వచ్చిన భారత జట్టుకు.. ఫైన్ విధించింది ఐసీసీ. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించడంతో పాటు 2 పాయింట్లను తగ్గించింది.
ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో టీమ్ఇండియా స్లో ఓవర్రెట్ కారణంగా పాయింట్లు కోల్పోవడం ఇది మూడోసారి. అంతకుముందు ఇదే సిరీస్‌లోని నాటింగ్‌హామ్ టెస్టులో రెండు పాయింట్లు, దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్ టెస్టులో ఓ పాయింట్ కోల్పోయింది. తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లోనూ రెండు పాయింట్ల కోత విధించడం వల్ల మొత్తంగా ఐదు పాయింట్లు నష్టపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత జట్టు 52.8 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. దాయాది దేశం పాకిస్థాన్ 52.38 శాతంతో మూడో స్థానానికి ఎగబాకింది.