తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​-శాంసన్​ వివాదం.. బీసీసీఐ-టీమ్ ​మేనేజ్​మెంట్​ మధ్య అసలేం జరుగుతోంది? - పంత్ సంజూ శాంసన్​కు టీమ్​ఇండియా

పంత్​-సంజూశాంసన్​ వివాదం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే?

Panth Sanju samsont
పంత్​-శాంసన్​ వివాదం.. బీసీసీఐ0-టీమ్ ​మేనేజ్​మెంట్​ మధ్య అసలేం జరుగుతోంది?

By

Published : Dec 8, 2022, 3:49 PM IST

కొంతకాలంగా టీమ్​ఇండియాలో పంత్​-శాంసన్​ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంసన్​ను పక్కనపెట్టి పంత్​కు అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు అని ఇప్పటికే క్రికెట్ ప్రేమికులు, మాజీలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికర విషయం వెలుగు చూసింది. పంత్‌కు అన్ని అవకాశాలు ఇస్తోంది బీసీసీఐ కాదట.. టీం మేనేజ్‌మెంటేనట!

న్యూజిల్యాండ్‌తో సిరీస్‌లో రిషభ్ పంత్ విఫలమయ్యాడు. పేలవ ప్రదర్శన చేస్తున్న కూడా అతడినే కొనసాగిస్తూ.. జట్టులో ఉన్న సంజూకు మాత్రం అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా తెలిసిన సమచారం ప్రకారం, కివీస్ పర్యటన నుంచి పంత్‌ వెన్నునొప్పితో బాధ పడుతున్నాడట. ఈ విషయాన్ని బీసీసీకి చెప్పాల్సిన టీం మేనేజ్‌మెంట్ మాత్రం సైలెంట్​గానే ఉందట. బోర్డుకు విషయం చెప్పకుండా, సంజూను ఆడించకుండా పంత్‌కు అవకాశాల మీద అవకాశాలు ఇచ్చింది.

బంగ్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సంగతి బీసీసీఐ పెద్దలకు తెలిసిందట. దాంతో వాళ్లు వెంటనే పంత్‌ను వెనక్కు పంపించాలని ఆదేశించారని తెలిసింది. ఈ సమయంలో కూడా సంజూను కనీసం రిప్లేస్‌మెంట్‌గా అడగని టీమ్​ మేనేజ్‌మెంట్.. రాహుల్‌తో కీపింగ్ చేయిస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానులు టీమ్​ మేనేజ్‌మెంట్‌పై మండి పడుతున్నారు. సంజూపై ఎందుకింత వివక్ష అని ప్రశ్నిస్తున్నారు.

టీమ్​మేనేజ్​మెంట్​ బీసీసీఐకి మధ్య వైరం.. బీసీసీఐలో కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత అంతర్గత వైరాలు పెరిగాయా? టీమ్​ మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐకి పడటం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ స్థానంలో కొత్తగా రోజర్ బిన్నీ ఈ పగ్గాలు అందుకున్నారు. అలా అధికారం చేపట్టిన వెంటనే సెలెక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు బిన్నీ ప్రకటించారు. ఈ క్రమంలో బీసీసీఐ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు టీం మేనేజ్‌మెంట్‌కు నచ్చట్లేదని తెలిసింది. అందుకే బోర్డుకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

ఇదీ చూడండి:టీమ్​ఇండియా షెడ్యూల్‌: లంక, కివీస్​, ఆసీస్​తో సిరీస్‌ వివరాలు ఇవే

ABOUT THE AUTHOR

...view details