శ్రీలంకపై టీ20, వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుని టీమ్ఇండియా ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఈ వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న భారత్ ఇప్పుడు న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సమరానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా జనవరి 18న తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతున్న కివీస్ కూడా పాక్‌తో టెస్టు, వన్డే సిరీస్ ఆడి ఇప్పుడు భారత్‌కు చేరుకుంది. టామ్ లాథమ్ సారథ్యంలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేదు. వీరి స్థానాల్లోమార్క్ చాప్‌మన్, జాకబ్ డఫేలు ఈ ఫార్మాట్లో ఆడనున్నారు.
IND VS NZ: న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే.. భారత్ ఖాతాలోకి ఆ రికార్డు! - భారత్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్
హైదరాబాద్ వేదికగా బుధవారం జరగనున్న వన్డే సిరీస్‌లో భారత్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఆ మ్యాచ్ వివరాలు.
అయితే శ్రీలంకపై 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజా సిరీస్‌లో కివీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగలిగితే వన్డేలో అగ్రస్థానంలోకి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 117 రేటింగ్‌తో న్యూజిలాండ్ తొలి స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ (113), ఆస్ట్రేలియా (112) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 110 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో, 106 పాయింట్లతో పాక్ ఐదో స్థానంలో ఉన్నాయి.
ఇప్పటికే టీ20ల్లో నంబర్ వన్‌గా టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు.. త్వరలో జరగనున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను చిత్తుచేయగలిగితే.. వన్డే, టెస్టుల్లోనూ పైచేయి సాధిస్తుంది. అలా మూడు ఫార్మాట్లలోనూ అగ్ర స్థానంలోనే నిలిచే అవకాశాన్ని సొంతం చేసుకుంటుంది. ఇకపోతే గిల్, కోహ్లీ సహా భారత టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండటం వల్ల, భారత్‌కు న్యూజిలాండ్‌ను ఓడించడం అంత కష్టం కాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు జనవరి 18, 21, 24 తేదీల్లో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతాయి. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.