తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక చిత్తు.. ఆసియా కప్​ విజేతగా భారత్.. ఏడోసారి టైటిల్​ గెలిచిన మహిళలు - టీమ్ ఇండియా మహిళల ఆసియా కప్

మహిళల ఆసియా కప్​ ఫైనల్​లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లో విజృంభించిన భారత్​.. శ్రీలంక జట్టును మట్టికరిపించింది. దీంతో ఏడో సారి టైటిల్​ కైవసం చేసుకుంది టీమ్​ ఇండియా.

womens asia cup 2022 final
womens asia cup 2022 final

By

Published : Oct 15, 2022, 3:19 PM IST

Updated : Oct 15, 2022, 9:01 PM IST

భారత మహిళా జట్టు ఏడో సారి ఆసియా కప్‌ టైటిల్ కైవసం చేసుకుంది. కీలకమైన ఫైనల్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు విజృంభించారు. శ్రీలంకను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన టీమ్​ ఇండియా ఘన విజయం సాధించింది.

టాస్‌ నెగ్గిన లంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకొంది. భారత బౌలర్లు బెంబేలెత్తించడంతోపాటు.. అనవసర తప్పిదాలు చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది.

.

రనౌట్లతో మొదలై..
లంక పతనం కెప్టెన్‌ చమరి ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) రనౌట్లతో మొదలైంది. స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత భారత బౌలర్‌ రేణుకా సింగ్‌ (3/5) విజృంభించడంతో లంక ఏదశలోనూ కోలుకోలేకపోయింది. లంక జట్టులో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఇనోకా రణవీర (18), ఓషాది రణసింగె (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రేణుకా సింగ్‌కు మద్దతుగా రాజేశ్వరి గైక్వాడ్ (2/13), స్నేహ్‌ రాణా (2/16) రాణించడంతో లంక ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. చివర్లో రణవీర కాస్త దూకుడుగా ఆడటంతో లంక ఈ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. మిగిలిన బ్యాటర్లలో హర్షిత మాధవి 1, నిలాక్షి డి సిల్వా 6, హాసిని పెరీరా డకౌట్, కవిష దిల్హారి 1, సుగంధిక కుమారి 6, ఆచిని 6 పరుగులు చేశారు.

.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్​.. సూనాయాసంగా టార్గెట్​ను ఛేదించింది. ఓపెనర్​ స్మృతి మంధాన చేలరేగి ఆడింది. అర్ధశతకం చేసి జట్టు విజయంలో కీలకం అయింది. మరో ఓపెనర్​ షెఫాలీ వర్మ 8 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్​ చేరింది. దీంతో ఒక వికెట్​ కోల్పోయేసరికి 32 పరుగులు జోడించారు ఓపెనర్లు. అనంతరం వచ్చిన జెమియా రోడ్రిగ్స్ వెంటనే 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగింది. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమ్​ ఇండియా.

.

మహిళల ఆసియా కప్​ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసియా కప్​ గెలిచిన జట్టును అభినందించారు. "మన మహిళా క్రికెట్ జట్టు తెగువ, నైపుణ్యంతో మనల్ని గర్వపడేలా చేస్తోంది. మహిళల ఆసియా కప్‌ను గెలుచుకున్న జట్టుకు నా అభినందనలు. జట్టు అద్భుతమైన నైపుణ్యం, టీమ్​ వర్క్​ను ప్రదర్శించింది" అని ప్రధాని మోదీ ట్విట్టర్​లో అభినందనలు తెలిపారు.

.

ఇవీ చదవండి:టీమ్​ఇండియా-పాక్​ ప్లేయర్స్​ కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే?

T20 worldcup: కోహ్లీపై​.. ఏ మంత్రం పని చేసిందో?

Last Updated : Oct 15, 2022, 9:01 PM IST

ABOUT THE AUTHOR

...view details