Team India Womens Squad :ఓ వైపు పురుషుల జట్టు టీ 20ల్లో రఫ్ఫాడిస్తుంటే.. మహిళల టీమ్ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై జరగనున్న రెండు కీలక సిరీసుల్లో ఆడనున్న మహిళల తుది జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసిన బీసీసీఐ.. ఈ రెండు టీమ్‌లకు కూడా హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సారథ్య పగ్గాలు అప్పజెప్పింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం భారత జట్టు రెడీగా ఉంది. ఆ తర్వాత ఇదే జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు ఆ్రస్టేలియాతో కూడా డిసెంబర్ 21 నుంచి జనవరి 5 వరకు భారత్ మూడు వన్డేలతో పాటు.. ఓ టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఇక ఆసీస్‌తో తలపడనున్న భారత టీ20 సిరీస్ జట్టును తర్వాత ప్రకటిస్తారు. ముంబయి వేదికగా ఈ మ్యాచ్‌లన్నీ జరుగుతాయి. ఇక భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 ఈ నెల 6న జరుగుతుంది.
ఆ ఇద్దరికి జట్టులో స్థానం..
Team India T20 Womens Squad : మరోవైపు ఇటీవలే మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాణించిన యువ స్పిన్నర్ సైకా ఇషాక్‌కు తొలిసారి భారత టీ20 స్థానం దక్కించుకుంది. ఇక వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న కర్ణాటక లెఫ్ట్ హ్యాండర్ శుభా సతీశ్‌ను బీసీసీఐ టెస్టు జట్టులోకి తీసుకుంది.