తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ విషయంలో భారత్​పై మాదే పైచేయి: పాక్ కెప్టెన్ - టీ20 ప్రపంచ కప్​

త్వరలోనే టీ20 ప్రపంచకప్(T20 World Cup)​ జరగనుంది. ఈ మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్​ను పాకిస్థాన్​తో ఆడనుంది టీమ్ఇండియా(ind vs pak t20). అయితే ఈ మ్యాచ్​లో తమతో పోలిస్తే.. భారత్​ మరింత ఒత్తిడికి లోనవుతుందని పాకిస్థాన్​ కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) అన్నాడు.

babar azam, Virat kohli
బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లీ

By

Published : Sep 3, 2021, 10:25 AM IST

టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021)లో పాకిస్థాన్​తో పోల్చితే టీమ్​ఇండియా(Team India News)పైనే తీవ్ర ఒత్తిడి ఉంటుందని పాక్​ జట్టు​ కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) అన్నాడు. దీనికి కారణమేంటో కూడా తెలిపాడు అజామ్.

"పాకిస్థాన్​తో పోల్చితే భారత జట్టు మరింత ఒత్తిడిలో ఉంటుంది. టీమ్​ఇండియా గ్రూప్​గా టీ20 ఆడి చాలా రోజులవుతుంది. ప్రస్తుతం భారత జట్టు టెస్టులు ఆడుతోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ఐపీఎల్​లో బిజీ అయిపోతారు. యూఏఈ మాకు సొంతిల్లు లాంటిది. ఈ మ్యాచ్​లో గెలవడానికి 100 శాతం మేం ప్రయత్నిస్తాం."

-బాబర్ అజామ్, పాకిస్థాన్ సారథి.

భారత్​ ఇటీవలే రెండు గ్రూపులుగా విడిపోయి సిరీస్​లు ఆడింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ప్రధాన జట్టు ఇంగ్లాండ్​లో టెస్టు ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్​తో పాటు ఇంగ్లీష్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇదే క్రమంలో శ్రీలంక పర్యటనలో ధావన్ కెప్టెన్​గా వన్డే, టీ20 సిరీస్​ల్లో పాల్గొంది. ఆ తర్వాత ఐపీఎల్​ ఆడనుంది. దీంతో టీ20 ప్రపంచకప్​కు ముందు భారత్ పూర్తి జట్టుగా టీ20 మ్యాచ్​ ఆడే వీలులేదు. ఈ నేపథ్యంలో అజామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ​

ఇదీ చదవండి:T20 Worldcup: 'భారత్​పై పాకిస్థాన్ గెలిచి తీరుతుంది'

ABOUT THE AUTHOR

...view details