తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా కొత్త జెర్సీతో మెరిసిన బుర్జ్​ ఖలీఫా - బుర్జ్ ఖలీఫా

టీమ్​ఇండియా కొత్త జెర్సీని(Team India Jersey) ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్​ ఖలీఫాపై(team india jersey on burj khalifa) ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

burj khalifa
బుర్జ్ ఖలీఫా

By

Published : Oct 14, 2021, 9:49 AM IST

టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని(Team India New Jersey) భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI News) బుధవారం రివీల్​ చేసింది. కిట్​ స్పాన్సర్​ ఎంపీఎల్​ స్పోర్ట్స్​తో(MPL India Jersey) సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. అయితే.. ఈ కొత్త జెర్సీ చిత్రాలను ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు యూఏఈ అధికారులు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను ప్లే చేశారు.

అక్టోబర్​ 18, 20న ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియాతో జరగనున్న వార్మప్​ మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా ఈ కొత్త జెర్సీని ధరించనుంది.

అభిమానులే స్ఫూర్తిగా..

అభిమానులే స్ఫూర్తిగా టీమ్​ఇండియా కొత్త జెర్సీని రూపొందించినట్లు బీసీసీఐ తెలిపింది. "అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి. గత మేటి మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు జెర్సీపై ఉంటాయి" అని ఎంపీల్‌ స్పోర్ట్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఎంపీల్‌ స్పోర్ట్స్.. భారత పురుషులు, మహిళల జట్ల అధికారిక కిట్‌ స్పాన్సర్‌. భారత క్రికెట్‌ జట్టుకు ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ చెప్పాడు.

ఇదీ చదవండి:

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​లతో టీమ్​ఇండియా వార్మప్ మ్యాచ్​లు

టీ20 ప్రపంచకప్ భారత జట్టులో మార్పులు.. శార్దూల్​కు చోటు

ABOUT THE AUTHOR

...view details