Shardul Thakur Engagement: టీమ్ఇండియా పేసర్ శార్దూల్ ఠాకూర్‌కు తన చిరకాల ప్రేయసి మిథాలీ పారుల్కర్‌తో నిశ్చితార్థం జరిగింది. ముంబయి క్రికెట్ అసోసియేషన్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం వివాహం చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎంగేజ్మెంట్ వేడుక మాత్రం సన్నిహితుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం విశేషం. ఈ వేడుకకు(Shardul Engagement News) హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా హాజరయ్యాడు.
"సోమవారం ముంబయి క్రికెట్ అసోసియేషన్ బీకేసీలో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే శార్దూల్ ఆహ్వానించాడు" అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఎంగేజ్మెంట్ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.