తెలంగాణ

telangana

ETV Bharat / sports

ట్రెండింగ్​ సాంగ్​కు టీమ్​ఇండియా క్రికెటర్ అదిరే స్టెప్పులు.. వీడియో చూశారా? - శ్రేయస్ అయ్యర్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్​.. తన డ్యాన్స్​తో మరోసారి అలరించాడు. తన సోదరితో కలిసి ట్రెండింగ్​లో ఉన్న పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. మీరూ ఓ సారి ఆ వీడియో చూసేయండి.

Shreyas iyer dance with his sister
సోదరితో కలిసి డ్యాన్స్ చేసిన శ్రేయస్ అయ్యర్​

By

Published : Feb 26, 2023, 3:01 PM IST

సోషల్​మీడియాలో ఎప్పుడు.. ఏ పాట ట్రెండ్​లోకి వస్తుందో తెలియదు. రోజుకో పాట ఫుల్​ ట్రెండ్​లో ఉంటుంది. తాజాగా మాల టమ్​ టమ్​.. మంతరం టమ్​ టమ్​ పాట ఫుల్​ ట్రెండింగ్​లో ఉంది. ఇన్​స్టాగ్రామ్​ ఓపెన్​ చేస్తే చాలు.. ఆ పాటతో చేసిన రీల్స్​ కనిపిస్తున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సెలబ్రిటీలు కూడా ఆ సాంగ్​కు స్టెప్పులు వేస్తూ.. ఫ్యాన్స్​ను అలరిస్తున్నారు. తాజాగా టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ కూడా అదే పాటకు తన సోదరితో కలిసి తనదైన స్టైల్​లో స్టెప్పులేసి దుమ్మురేపాడు.

టీమ్​ఇండియా బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్ ఆటలోనే కాదు డ్యాన్స్​లోనూ అదరగొడతాడు. ఈ విషయాన్ని చాలా సార్లు నిరూపించాడు కూడా. గతంలోనూ తన సోదరితో కలిసి ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి అబ్బురపరిచాడు. తాజాగా మరోసారి తన సోదరి శ్రేష్ఠతో కలిసి 'మాల టమ్ టమ్.. మంతరం టమ్ టమ్' అనే తమిళ పాటకు బాస్కెట్ బాల్ కోర్టులో స్టెప్పులేశాడు. శ్రేయస్ సోదరి శ్రేష్ఠ.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం వీరి డ్యాన్స్​ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇకపోతే.. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్​ మ్యాచ్​కు దూరమైన శ్రేయస్.. రెండో మ్యాచ్​లో బరిలోకి దిగాడు.​ అయితే తన మార్కు చూపించే విషయంలో రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలమయ్యాడు. దిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్​లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్​లో 12 పరుగులు మాత్రమే చేసి రెండుసార్లూ ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్​లోనే పెవిలియన్​ చేరాడు. మార్చి 1ను ప్రారంభం కానున్న మూడో టెస్ట్​ మ్యాచ్​ కోసం శ్రేయస్​ ప్రాక్టీస్​ చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details