Team India Squad Vs Eng Test Series:స్వదేశంలో జనవరి 26నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్నటెస్టు సిరీస్‌కు బీసీసీఐ టీమ్ఇండియా జట్టును ఎంపిక చేసింది. తొలి రెండు టెస్టులకు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌కాగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
సీనియర్ ఆటగాళ్లు చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు మరోసారి నిరాశ తప్పలేదు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లోనూ వారికి అవకాశం దక్కలేదు. దాదాపుగా దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో తలపడిన జట్టునే ఈ సారి కూడా ఎంపిక చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని స్టార్ పేసర్ మహ్మద్ షమి ఈ సారి జట్టుకు ఎంపిక కాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఇషాన్ కిషన్‌ను కూడా తీసుకోలేదు. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు.
ఈ సారి తెలుగు తేజం కేఎస్ భరత్ తుది జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతలను మాత్రం కేఎల్ రాహుల్ చేపట్టే అవకాశముంది. రంజీ ట్రోఫీలో గాయపడ్డ ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా అవేష్ ఖాన్ ఈ టెస్టు జట్టులోకి వచ్చాడు. స్పిన్ విభాగంలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లకు తోడుగా కుల్‌దీప్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.