Team India Squad For WI : జూలైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు వన్డే, టెస్ట్ మ్యాచ్‌లకు జట్టును ఎంపిక చేసింది. సీనియర్ బ్యాటర్, నయా వాల్ ఛెతేశ్వర్ పుజారాపై వేటు వేసింది బీసీసీఐ. టెస్టు జట్టు నుంచి అతడిని తప్పించింది. యంగ్ ఓపెనర్యశస్వీ జైశ్వాల్, పేసర్ ముకేశ్ కుమార్ల తలుపు తట్టింది సెలెక్షన్ టీమ్. దీంతో వీరిద్దరూ టీమ్ఇండియా తరఫున టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు సీనియర్ బ్యాటర్ అజింక్య రహానేను టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. బౌలర్ నవదీప్ సైనీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా సీనియర్ పేస్ బౌలర్ షమీకి సెలక్షర్లు విశ్రాంతినిచ్చారు.
ODI World Cup 2023 : వన్డే జట్టు కూర్పులో సెలెక్షన్ కమిటీ కీలకంగా వ్యవహరించింది. టీమ్ఇండియా వన్డే జట్టుకు హర్దిక్ పాండ్యకు బీసీసీఐ వైస్‌కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. సంజూ శాంసన్ మళ్లీ వన్డే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. శాంసన్.. మిడిల్ అర్డర్‌లో నిలకడగా రాణించగలిగితే ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో అతడు కీలకంగా మారతాడు. వికెట్ కీపింగ్ రోల్ పోషించడం కూడా శాంసన్‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విభాగంలో ముకేశ్ కుమార్ ఈ సిరీస్‌తో టీమ్ఇండియాలో అరంగేట్రం చేయనున్నాడు. చాలా గ్యాప్ తర్వాత టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్.. ఈ పర్యటనలో ప్రభావం చూపకపోతే అతడికి ప్రపంచకప్ జట్టులో చోటు కష్టంగా మారుతుంది.