భారత్- శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో టాస్ గెలిచిన శనక సేన బ్యాటింగ్ ఎంచుకుంది. కొలొంబో ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ను కూడా గెలిచి సిరీస్ను తన ఖాతాలో వేసుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది.
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
జట్లు..
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హర్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.
శ్రీలంక: దసన్ శనక(కెప్టెన్), ధనుంజయ డిసిల్వా, చరిత అసలంక, అవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, భనుక రాజపక్స, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, కసున్ రజిత, దుస్మంత చమీర, లక్షన్ సండకన్.