తెలంగాణ

telangana

కెరీర్​లో ఒక్కసారే స్టంప్​ ఔట్​.. అది కూడా ఒకే బౌలర్ చేతిలో.. సచిన్​, ద్రవిడ్​ స్పెషల్​ రికార్డ్​!

By

Published : Feb 22, 2023, 9:13 AM IST

క్రికెట్​ దిగ్గజాలు సచిన్​ తెందూల్కర్​, రాహుల్ ద్రవిడ్ తమ టెస్ట్ కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే స్టంప్ ఔట్ అయ్యారు. అయితే ఇద్దరూ ఒకే బౌలర్​ చేతిలోనే అవుట్​ అవ్వడం గమనార్హం.

sachin dravid
sachin dravid

భారత మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ తెందూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట ప్రత్యేక రికార్డు ఉంది. ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్‌లో ఒకే ఒక్కసారి స్టంప్ ఔట్ అయ్యారు. అది కూడా ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఆష్లే గైల్స్‌ బౌలింగ్‌లో ఇద్దరు ఆటగాళ్లు స్టంప్​ ఔట్​ అయ్యి పెవిలియన్​ చేరారు. ఇద్దరు ఆటగాళ్లను ఒకే ఒక్క బౌలర్ ఔట్ చేయడం, అది కూడా ఒక్కసారి మాత్రమే కావడం యాదృచ్ఛికం.

రాహుల్ ద్రవిడ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 286 ఇన్నింగ్స్‌ల్లో 52.31 సగటుతో 13,288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో ద్రవిడ్ 5 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఇందులో ద్రవిడ్ అత్యధిక స్కోరు 270 పరుగులుగా నిలిచింది.

అదే సమయంలో, సచిన్ తెందూల్కర్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో సచిన్ 329 ఇన్నింగ్స్‌లో 53.79 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో సచిన్ 6 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఇందులో మాస్టర్​ అత్యధిక స్కోరు 248 పరుగులుగా ఉంది.

ప్రస్తుతం టీమ్​ఇండియా.. ప్రతిష్ఠాత్మక బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్ట్​ సిరీస్​ ఆడుతోంది. తొలి రెండు టెస్టుల్లో విజయ కేతనం ఎగురవేసి 2-0 ఆధిక్యంలో భారత్​ కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్​ మ్యాచ్​.. మార్చి 1వ తేదీన ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details