తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రేయస్ సాహసం.. వరల్డ్ కప్ కోసం ఆపరేషన్​ వద్దంటున్నాడట! - శ్రేయస్​ అయ్యర్​ వన్డే వరల్ట్​ కప్​

వెన్ను గాయం కారణంగా తన కళ్ల ముందే వరల్డ్ కప్ ఆడే కల కరిగిపోతుంటే టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ శ్రేయస్ అయ్యర్ తీవ్ర వేదనకు గురవుతున్నాడు. ఎలాగైనా సరే ప్రపంచ కప్ ఆడాలనే పట్టుదలతో ఉన్న అతడు.. బీసీసీఐ సలహాకు విరుద్ధంగా సర్జరీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

team india player shreyas iyer
team india player shreyas iyer

By

Published : Mar 24, 2023, 10:49 AM IST

Updated : Mar 24, 2023, 2:52 PM IST

టీమ్​ఇండియా మిడిలార్డర్ స్టార్​ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడలేకపోయిన అతడు.. నాలుగో టెస్టులో బ్యాటింగ్‌కు దిగలేదు. అయతే వెన్నెముక సంబంధిత సమస్యకు సర్జరీ చేయించుకోవాలని శ్రేయస్‌కు బీసీసీఐ సూచించింది. లండన్‌లో లేదా మరో చోట అయ్యర్‌కు సర్జరీ జరుగుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ సర్జరీ జరిగితే 6-7 నెలలపాటు అతడు కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐపీఎల్ 2023తో పాటు వన్డే వరల్డ్ కప్‌కు కూడా అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది.

ఏ ఆటగాడికైనా వరల్డ్ కప్ ఆడటం కల. యువరాజ్ లాంటి ఆటగాడు క్యాన్సర్‌‌తో పోరాడుతూనే 2011లో టీమ్​ఇండియాకు వరల్డ్ కప్ అందించాడు. అయ్యర్ కూడా ఎలాగైనా సరే వరల్డ్ కప్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. సర్జరీ చేయించుకుంటే ప్రపంచ కప్‌కు దూరంగా ఉండిపోయే ప్రమాదం ఉండటంతో ఇప్పుడే సర్జరీ చేయించుకోవద్దని శ్రేయస్ అయ్యర్ డిసైడయ్యాడట. వన్డే వరల్డ్ కప్ ఆడటం కోసం బీసీసీఐ సలహాకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడట. అందుకే వెన్ను సమస్యను సరి చేసుకోవడానికి సర్జరీ చేయించుకోవాలన్న నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనను అయ్యర్ తిరస్కరించాడట.

వెన్ను నొప్పిని తగ్గించడం కోసం ఇటీవలే అయ్యర్‌కు ఆరు ఇంజెక్షన్లు ఇచ్చారు. డాక్టర్ల సలహాతో శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ఆయుర్వేద చికిత్స పొందుతున్నాడట. ఐపీఎల్ మొత్తానికీ అయ్యర్ దూరం అవుతాడని భావించగా.. అతడు సర్జరీని వాయిదా వేసుకోవడంతో లీగ్ తొలి అర్ధ భాగానికి అతడు దూరమయ్యే అవకాశం ఉంది. వైద్య నిపుణుల సలహా మేరకు నొప్పి తగ్గడం కోసం అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత మెల్లగా ఎక్సర్‌సైజ్‌లు ప్రారంభించనున్నాడు.

అయ్యర్ ఇంతకు ముందు కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు రిహాబిలిటేషన్లో ఉన్న అతడు.. ఆక్యుపంక్చర్ చికిత్స పొందాడు. వెన్ను సమస్య కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అయ్యర్ దూరం కానుండటంతో.. కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్‌‌ను నియమించనుంది. నితీశ్ రాణా, టిమ్ సౌథీల్లో ఒకరు కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్చి 31వ తేదీన ఐపీఎల్​ 16వ సీజన్​ ప్రారంభం కానుంది. సుమారు రెండు నెలలపాటు ఈ లీగ్​ సాగనుంది. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, గుజరాత్ జెయింట్స్​ జట్లు తలపడనున్నాయి.

Last Updated : Mar 24, 2023, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details